Tollywood: కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు దానం చేసిన స్టార్ హీరోయిన్.. ఆమె జీవితమే విషాదాంతం..

అందం, అభినయంతో దక్షిణాది అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. అగ్ర కథానాయికగా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఆమె.. జీవితం మాత్రం కష్టాలు, కన్నీళ్లతోనే గడిచింది. కోరిన ప్రేమకు తల్లి అడ్డుపడింది. వైవాహిక బంధంలో భర్త మోసం ఆమెను మానసికంగా చిత్రవధ చేసింది. అయినా మరోసారి సినిమాను నమ్ముకున్న ఆమె విధిరాతకు బలయ్యింది. చనిపోతానని తెలిసి తన ఆస్తి మొత్తాన్ని పేద విద్యార్థులకు విరాళంగా ఇచ్చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..

Tollywood: కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు దానం చేసిన స్టార్ హీరోయిన్.. ఆమె జీవితమే విషాదాంతం..
Srividya
Follow us

|

Updated on: Oct 19, 2024 | 4:29 PM

వెండితెరపై ఎంతో మంది హీరోయిన్స్ చెరగని ముద్ర వేసారు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఒకప్పుడు టాప్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారారు. ఒక్క సినిమాలో నటించే ఛాన్స్ వస్తే సెలబ్రెటీ అయిపోవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ సినీరంగుల ప్రపంచంలో అందరిని ఆకట్టుకునే గ్లామర్ పాత్రలే కాదు.. కొందరి జీవితపు పేజీలను పరిశీలిస్తే అంతులేని కన్నీటి గాథలు ఎన్నో. ఇప్పుడు మీకు చెప్పబోయే హీరోయిన్ జీవితం విషాదాంతం. ప్రియుడి కోసం మతాన్ని మార్చుకుని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ ప్రేమకే ఆమె బలైంది. టాలీవుడ్ స్టార్ హీరోను ప్రేమించి ఆ ప్రేమను సొంతం చేసుకోలేకపోయింది. అందాల రాశిగా వెండితెరపై సందడి చేసిన ఆ హీరోయిన్ తన మరణానికి ముందు కోట్లాది ఆస్తిని పేద విధ్యార్థులకు విరాళంగా ఇచ్చింది. తనే సీనియర్ హీరోయిన్ శ్రీవిద్య.

సినీరంగుల ప్రపంచంలో అందాల కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఈ సినీతార జీవితంలో విధి ముఖ్య పాత్ర పోషించింది. శ్రీవిద్య ప్రముఖ హాస్యనటుడు కృష్ణమూర్తి, కర్ణాటక గాయని ML వసంత కుమారి కుమార్తె. శ్రీవిద్య పుట్టిన ఏడాదికే ఆమె తండ్రి కృష్ణమూర్తి యాక్సిడెంట్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ శ్రీవిద్య తల్లి ఎంఎల్ వసంతకుమారి చూసుకోవాల్సి వచ్చింది. నటి శ్రీవిద్య 14 ఏళ్ల వయసులో కుటుంబ ఆర్థిక సంక్షోభంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. శివాజీ గణేశన్ నటించిన తిరువరుట్‌చెల్వన్‌ మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత పెద్దరాశి పెద్దమ్మ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది.

అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఆమెకు సౌత్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ వచ్చాయి. దర్శకుడు దాసరి నారయణరావు ప్రోత్సాహంతో ఆమె ఎన్నో చిత్రాల్లో కథానాయికగా అలరించింది. సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ జోడిగా కనిపించింది. దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగళ్’లో రజనీకాంత్, కమల్ హాసన్ తో కలిసి నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేశారు. అప్పట్లో కమల్, శ్రీవిధ్య కలిసి ఎక్కువ చిత్రాల్లో నటించారు. అదే సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కానీ కమల్, శ్రీవిధ్య పెళ్లికి ఆమె తల్లి ఒప్పుకోకపోవడంతో వీరిద్దరి ప్రేమ బంధం మధ్యలోనే ముగిసిపోయింది. ఆ తర్వాత శ్రీవిద్య 1978లో మలయాళ దర్శకుడు జార్జ్ థామస్‌ని పెళ్లాడింది. వివాహానంతరం భర్త కోరిక మేరకు సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పింది. పెళ్లి తర్వాత ఆమె జీవితం మలుపుతిరిగింది. ఆమె ఆస్తి మొత్తాన్ని తన పేరు మీదకు మార్చుకున్నాడు. వైవాహిక జీవితంలో మనస్పర్థలు రావడంతో 1980లో విడాకులు తీసుకున్నారు. ఆర్థిక సమస్యలు ప్రారంభం కావడంతో మరోసారి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సినీ పరిశ్రమలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీవిద్య.. తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ లో మెరిసింది. 2003లో శ్రీవిద్య అనారోగ్య సమస్యలతో బాధపడింది. కేన్సర్‌ బారిన పడిన ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సంగీత, నృత్య కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు తన ఆస్తి మొత్తాన్ని విరాళంగా ప్రకటించింది. ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి స్టార్ నటీనటులతో విరాళాలు సేకరించి పేద విద్యార్థులకు అందించింది. 2006లో 53 ఏళ్ల వయసులో శ్రీవిద్య మరణించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు దానం చేసిన స్టార్ హీరోయిన్..
కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు దానం చేసిన స్టార్ హీరోయిన్..
దేశం టాటాకు సెల్యూట్ చేసిన వేళ.. ఈ డీల్‌కు మంచి గుర్తింపు!
దేశం టాటాకు సెల్యూట్ చేసిన వేళ.. ఈ డీల్‌కు మంచి గుర్తింపు!
గ్రూప్-1 అభ్యర్ధుల ర్యాలీలో తోపులాట..బండిసంజయ్, RSప్రవీణ్ అరెస్ట్
గ్రూప్-1 అభ్యర్ధుల ర్యాలీలో తోపులాట..బండిసంజయ్, RSప్రవీణ్ అరెస్ట్
దీపిక, అలియాలను దాటేసిన శ్రద్ధా కపూర్.. ప్రధాని మోడీ సైతం..
దీపిక, అలియాలను దాటేసిన శ్రద్ధా కపూర్.. ప్రధాని మోడీ సైతం..
మహిళా రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం చంద్రబాబు
మహిళా రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం చంద్రబాబు
సముద్ర తీరానికి వేలాదిగా కొట్టుకొచ్చిన మిస్టరీ బాల్స్.. ఆరా తీయగా
సముద్ర తీరానికి వేలాదిగా కొట్టుకొచ్చిన మిస్టరీ బాల్స్.. ఆరా తీయగా
డార్లింగ్ సినిమాలు రీ రిలీజ్‎ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే..
డార్లింగ్ సినిమాలు రీ రిలీజ్‎ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే..
లేడీ గెటప్‌లో సర్ ప్రైజ్ చేసిన టాలీవుడ్ నటుడు.. 
లేడీ గెటప్‌లో సర్ ప్రైజ్ చేసిన టాలీవుడ్ నటుడు.. 
లండన్‌ ISR సదస్సులో తెలంగాణ వ్యాపారవేత్తకు ప్రతిష్టాత్మక అవార్డు
లండన్‌ ISR సదస్సులో తెలంగాణ వ్యాపారవేత్తకు ప్రతిష్టాత్మక అవార్డు
వికసిత్ భారత్ నిర్మాణానికి ఇదే స్ఫూర్తినిస్తోంది: ప్రధాని మోదీ
వికసిత్ భారత్ నిర్మాణానికి ఇదే స్ఫూర్తినిస్తోంది: ప్రధాని మోదీ