AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అందానికి ఆమె ప్రతిరూపం.. ఈ క్యూట్ బుజ్జాయి టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

ఆ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న ఆ చిన్నారి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. దాదాపు 18 ఏళ్ల తర్వాత సినీరంగంలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ ఎవరో తెలుసా..

Tollywood: అందానికి ఆమె ప్రతిరూపం.. ఈ క్యూట్ బుజ్జాయి టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Actress
Rajitha Chanti
|

Updated on: Oct 19, 2024 | 4:59 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆమె రూపం సుమనోహార రూపం. ఎప్పుడూ పెదాలపై చెరగని చిరునవ్వుతో, తనదైన నటనతో వెండితెరపై మాయ చేస్తోంది. విమర్శకలకు ఆమె చిరునవ్వే సమాధానం. టాప్ హీరోయిన్ గా వరుస ఆఫర్స్ అందుకుంటూ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ముంబైకి చెందిన ఆమె.. ఆ స్టార్ హీరోను ప్రేమ వివాహం చేసుకుని తెలుగింటి కోడలయ్యింది. కొన్నేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆ హీరోయిన్.. ఇన్నాళ్లకు సినీరంగంలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ క్యూట్ బుజ్జాయి ఎవరో తెలుసా..? తనే సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్.

రేణు దేశాయ్.. తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతోనే తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ సమయంలోనే పవన్, రేణు దేశాయ్ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన జానీ చిత్రం కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. 2009లో ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో వీరిద్దరి వివాహం జరగ్గా..ఈ దంపతులకు అకీరా నందన్, ఆద్య జన్మించారు. కానీ కొన్నేళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం తన కొడుకు, కూతురుతో కలిసి ఉంటున్నారు రేణు దేశాయ్.

గతంలో మాస్ మాహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. దాదాపు 18 సంవత్సరాలు నటనకు దూరంగా ఉన్న ఆమె చాలా కాలం తర్వాత స్క్రీన్ పై కనిపించి మరోసారి మ్యాజిక్ చేశారు. ఆ సినిమాలో హేమలత లవణం పాత్రలో అద్భుతమైన నటనతో అలరించారు. ఆ తర్వాత మరో సినిమా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.

ఇది చదవండి :

Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..’భద్ర’ మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.