AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ధోని డాటర్ కెరీర్ గోల్ ఏంటో తెలుసా.. కళ్లు చెదిరే ఆన్సర్‌తో షాకిచ్చిన జీవా..

MS Dhoni's Daughter Ziva Goal: ధోనీ భార్య సాక్షి ధోనీతో కలిసి జీవా ఇటీవల ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ పర్యటనకు వెళ్లింది. అక్కడ గంగా మాత ఆశీస్సులు తీసుకున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో (Internet) వైరల్ అయ్యాయి.

Video: ధోని డాటర్ కెరీర్ గోల్ ఏంటో తెలుసా.. కళ్లు చెదిరే ఆన్సర్‌తో షాకిచ్చిన జీవా..
Ms Dhoni Daughter Ziva
Venkata Chari
|

Updated on: Oct 27, 2025 | 7:38 PM

Share

MS Dhoni’s Daughter Ziva Goal: భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తె జీవా ధోనీ తన బాల్యపు సరదాలు, క్యూట్ వీడియోలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో సెన్సేషనే. అయితే, ఇటీవల ఆమె తన కెరీర్ లక్ష్యాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. క్రికెటర్ కూతురంటేనో, లేక ఫ్యాషన్ రంగంలోనో అడుగుపెడుతుందని అనుకునేవారికి భిన్నంగా, జీవా ప్రకృతిని ప్రేమించే ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని ఎంచుకుంది.

హరిద్వార్ పర్యటనలో లక్ష్యాన్ని వెల్లడించిన జీవా..

ధోనీ భార్య సాక్షి ధోనీతో కలిసి జీవా ఇటీవల ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ పర్యటనకు వెళ్లింది. అక్కడ గంగా మాత ఆశీస్సులు తీసుకున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో (Internet) వైరల్ అయ్యాయి. ఈ పర్యటనలో భాగంగా, జీవా ఒక స్థానిక యాక్టివిస్ట్‌తో మాట్లాడింది. ఆ సంభాషణలో ఆమె తన భవిష్యత్తు గురించి మాట్లాడింది.

ఇవి కూడా చదవండి

యాక్టివిస్ట్ ఆమెను “పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు?” అని అడగగా, జీవా ఏమాత్రం తడుముకోకుండా, “నేను నేచురలిస్ట్‌ని కావాలనుకుంటున్నాను” అని బదులిచ్చింది.

‘నేచురలిస్ట్’ అంటే ఏంటి?

సాధారణంగా 10 ఏళ్ల పిల్లలు డాక్టర్, ఇంజనీర్ లేదా క్రికెటర్ వంటి వృత్తుల గురించి మాట్లాడతారు. కానీ, జీవా ఎంచుకున్న ‘నేచురలిస్ట్’ (Naturalist) అనేది ప్రకృతి అధ్యయనం, జంతువులు, మొక్కలు, పర్యావరణ వ్యవస్థలను పరిశోధించే ఒక ప్రత్యేకమైన ఉద్యోగం. ఈ ఎంపిక ఆ యాక్టివిస్ట్‌ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఆయన “10 ఏళ్ల అమ్మాయికి ఇది చాలా ప్రత్యేకమైన లక్ష్యం. అద్భుతం!” అని ప్రశంసించారు. పక్కనే ఉన్న సాక్షి ధోనీ కూడా ముసిముసి నవ్వులు నవ్వుతూ, “ఆమె తప్పకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిస్తున్నాను” అని అన్నారు.

ధోనీ కుటుంబానికి ప్రకృతితో బంధం..

ధోనీ కుటుంబానికి ప్రకృతి, వన్యప్రాణులతో ఉన్న అనుబంధం గురించి సోషల్ మీడియాలో తరచుగా కనిపిస్తుంది. ధోనీ స్వయంగా తన రాంచీ ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేయడమే కాకుండా, ఆయనకు జంతువులంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. తన స్వస్థలమైన ఉత్తరాఖండ్‌పై ఉన్న మక్కువ కారణంగానే ధోనీ 2010లో ఉత్తరాఖండ్ టైగర్ కన్జర్వేషన్ మిషన్‌కు గౌరవ అంబాసిడర్‌గా కూడా పనిచేశారు.

కుటుంబ నేపథ్యం, పర్యావరణంపై ఆసక్తి వంటి కారణాల వల్లనే జీవా ఇంత చిన్న వయసులో ఇంత అరుదైన లక్ష్యాన్ని ఎంచుకొని ఉండవచ్చు. జీవా తన తల్లిదండ్రులు ఇద్దరి లక్షణాలను అందిపుచ్చుకుందని, పర్యావరణం, జంతువుల గురించి చాలా ప్రశ్నలు అడుగుతుందని గతంలో సాక్షి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వీడియో, ఆ కుటుంబానికి ప్రకృతిపై ఉన్న ప్రేమను మరోసారి స్పష్టం చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..