7 ఫోర్లు, 1 సిక్స్.. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. తుఫాన్ హాఫ్ సెంచరీతో చెలరేగిన కావ్యపాప ప్లేయర్..
Australia vs India, 2nd T20I: ఓవైపు వికెట్లు పడుతున్నా.. ఆసీస్ బౌలర్లను ఏమాత్రం లెక్కచేయకుండా, అభిషేక్ శర్మ తనదైన శైలిలో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును చేరుకుని, ఆస్ట్రేలియా బౌలింగ్ దళాన్ని కంగుతినిపించాడు.

Abhishek Sharma Half Century: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ విన్యాసంతో అభిమానులను ఉర్రూతలూగించాడు. నిలకడగా రాణిస్తున్న ఈ యువ సంచలనం, ఈ మ్యాచ్‌లో తన ఆరో T20 అంతర్జాతీయ అర్ధ సెంచరీని (6th T20I fifty) నమోదు చేసి, భారత్ ఇన్నింగ్స్‌కు అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు.
ఓవైపు వికెట్లు పడుతున్నా.. ఆసీస్ బౌలర్లను ఏమాత్రం లెక్కచేయకుండా, అభిషేక్ శర్మ తనదైన శైలిలో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును చేరుకుని, ఆస్ట్రేలియా బౌలింగ్ దళాన్ని కంగుతినిపించాడు. అతని విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా భారత్ ప్రస్తుతం 13.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. మరోవైపు సింగిల్ డిజిట్‌కే టీమిండియా కీలక ఆటగాళ్లు పెవిలియన్ చేరడంతో ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న గంభీర్ ప్రియ శిష్యుడు హర్షిత్ రాణా తనదైన శైలిలో అభిషేక్ శర్మకు అండగా నిలిచాడు. వీరిద్దరి మధ్య ప్రస్తుతం 47 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.
కాగా, అంతర్జాతీయ టీ20ల్లో అభిషేక్ శర్మ ఆరో అర్ధ సెంచరీ సాధించడం, ఈ ఫార్మాట్‌లో అతని నిలకడైన ప్రదర్శనకు నిదర్శనం.
రెండు జట్ల ప్లేయింగ్ 11
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాట్ కున్‌హెమన్, జోష్ హేజిల్‌వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








