Lord Ganesha Puja: బుధవారం ఆకుపచ్చ రంగు ప్రాముఖ్యత ఏమిటి? ఈ రోజున గణేశుడికి ఏమి సమర్పించాలంటే..
హిందూ మతంలో బుధవారం గణేశుడికి అంకితం చేయబడింది. ఈ రోజున ఆకుపచ్చ రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గణేశుడి భక్తులు ఆకుపచ్చ దుస్తులు ధరిస్తారు. దర్భగడ్డితో పాటు ఆకుపచ్చ వస్తువులను ఆయనకు సమర్పిస్తారు. ఈ రోజు బుధవారం పూజలో ఆకుపచ్చ రంగుకి ఉన్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..

బుధవారం శివ పార్వతుల తనయుడు గణేశుడికి అంకితం చేయబడింది. ఈ రోజున భక్తులు అత్యంత భక్తిశ్రద్దలతో గణేశుడిని పూజిస్తారు. ఉపవాసం ఉంటారు. హిందూ మతంలో ప్రతి రోజు ధరించే రంగుకు దాని సొంత ప్రాముఖ్యత ఉంది. బుధవారం ఆకుపచ్చ దుస్తులు ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున గణేశుడికి ఆకుపచ్చ వస్తువులను కూడా సమర్పిస్తారు. బుధవారం గణేశుడిని పూజించే వారు ఈ రోజున అతనికి ఏ ఆకుపచ్చ వస్తువులను సమర్పించాలో తెలుసుకుందాం..
బుధవారం ఆకుపచ్చ రంగు ప్రాముఖ్యత
- బుధ గ్రహం గణేశుడితో సంబంధం కలిగి ఉండటం వలన బుధవారం రోజున ఆకుపచ్చ రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆకుపచ్చ రంగు జ్ఞానం, వ్యాపారం, పురోగతి, శ్రేయస్సును సూచిస్తుంది. బుధవారం నాడు ఆకుపచ్చ రంగు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. బుధ గ్రహం సానుకూలతను కాపాడుతుంది.
- బుధుడు: ఆకుపచ్చ రంగు బుధ గ్రహాన్ని సూచిస్తుంది. ఇది తెలివితేటలు, వ్యాపారం, ఆర్థిక నిర్వహణతో ముడిపడి ఉంటుంది. బుధవారం ఆకుపచ్చ రంగు ధరించడం వల్ల బుధ దోషం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ రంగాలలో విజయం సాధించవచ్చు.
- గణేశుడు: బుధవారం గణేశుడికి అంకితం చేయబడింది. అతను ఆకుపచ్చ రంగులో ఉండే దర్భ గడ్డి అంటే ఇష్టం. కనుక ఈ రోజున ఆకుపచ్చ రంగును ధరించడం గణేశుడిని సంతోషపరుస్తుంది.
- మానసిక ప్రశాంతత: ఆకుపచ్చ రంగు మనస్సులో ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది సానుకూల ఆలోచనను ప్రోత్సహిస్తుంది. సంబంధాలను మెరుగుపరుస్తుంది.
బుధవారం ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి
బుధవారం ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఆనందం, శాంతి , శ్రేయస్సు వస్తుంది. ఇంకా బుధవారం ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. బుధవారం ఆకుపచ్చ రంగు పూజా వస్తువులు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. బుధవారం గణేశుని పూజ సమయంలో ఆకుపచ్చ రంగు వస్తువులను సమర్పించడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలలో విజయం సాధించవచ్చు. అడ్డంకులు తొలగిపోతాయి.
బుధవారం గణేశుడికి ఏమి సమర్పించాలి?
- బుధవారం నాడు గణేశుడికి ఆకుపచ్చని వస్తువులను అంటే దర్భ గడ్డి, జమ్మి ఆకులు వంటివి సమర్పించండి. బుధవారం నాడు ఈ వస్తువులను సమర్పించడం వలన గణేశుడు సంతోషిస్తాడు. కోరిన కోరికలు నెరవేరుతాయి.
- పెసలు:పెసలను గణపతికి సమర్పించి .. వాటిని దానం చేయండి. బుధవారం పెసలు తినండి.
- దర్భ గడ్డి: గణేశుడికి 21 దర్భ కట్టలను సమర్పించండి. ఈ నైవేద్యం జ్ఞానం, విచక్షణను పెంచుతుంది. సమస్యలను తొలగిస్తుంది.
- జమ్మి ఆకులు: బుధవారం నాడు గణేశుడికి జమ్మి ఆకులు సమర్పించండి. ఇది ఒత్తిడి, మానసిక బాధ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
- ఆకుపచ్చ రంగు దుస్తులు: బుధవారం నాడు గణేశుని పూజ సమయంలో ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి.
బుధవారం ఏమి దానం చేయాలంటే
- బుధవారం నాడు పచ్చి పెసలు లేదా పచ్చని వస్త్రాలను దానం చేయాలి.
- బుధవారం నాడు జామ లేదా ద్రాక్ష వంటి ఆకుపచ్చ పండ్లను దానం చేయండి.
- బుధవారం నాడు విద్యకు సంబంధించిన వస్తువులను అంటే పుస్తకం, పెన్ను, పెన్సిల్ వంటి వాటిని పేదవారికి దానం చేయవచ్చు.
- బుధవారం నాడు ఆవుకు పచ్చగడ్డి ని ఆహారంగా ఇవ్వడం కూడా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








