Swapna shastra: కలలో లేదా రోడ్డుపై నల్ల పిల్లి కనిపిస్తే అర్థం ఏమిటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
పిల్లి ఎక్కడికైనా వెళ్ళినపుడు కనిపిస్తే దానిని చాలా మంది ఆశుభంగా భావిస్తారు. అయితే నల్ల పిల్లి కనిపిస్తే మాత్రం శకున శాస్త్రం ప్రకారం ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. కలలో, రోడ్డుపై లేదా దానికి అడ్డంగా నల్ల పిల్లి కనిపిస్తే అది శకున శాస్త్రం ప్రకారం మాత్రమే కాదు స్వప్న శాస్త్రం ప్రకారం కూడా శుభ సంకేతం.ఇది ఆర్థిక వృద్ధిని, ఆరోగ్యంలో మెరుగుదలను, శత్రువులను స్నేహితులుగా మార్చడాన్ని , ఉపాధిలో పురోగతిని సూచిస్తుందట.

ప్రతి ఒక్కరికీ నిద్రలో కలలు వస్తాయి. ఆ కలలో రకరకాల సంఘటనలు, జంతువులు, పక్షులు కనిపిస్తాయి. అదే విధంగా ఎవరి కలలో నైనా లేదా వెళ్తున్న దారిలో నల్ల పిల్లి వస్తే దాని అర్థం ఏమిటో స్వప్న శాస్త్రం లో వివరించారు. బల్లులు, ఆవులు, పాములు, పిల్లులు మొదలైన జంతువులు శుభ లేదా అశుభ సంకేతాలను ఇస్తాయని నమ్ముతారు. ఇంట్లో కట్టివేయబడిన ఆవు బిగ్గరగా గర్జిస్తే.. అది ఇంటికి ఒక పెద్ద ఆపద రానుందని సూచిస్తుందని చెబుతారు. అదేవిధంగా ప్రయాణం చేస్తున్నప్పుడు పిల్లి మీ దారిని దాటుతూ వెళ్ళితే.. అంటే పిల్లి ఎదురైతే చాలా మంది దానిని అశుభంగా భావిస్తారు. ముఖ్యంగా పిల్లి మీరు వెళ్తున్న దారిలో ఎడమ నుంచి కుడికి దాటితే..ప్రయాణం వాయిదా వేసుకుంటారు.
అయితే ఈ సాధారణ నమ్మకానికి విరుద్ధంగా శకున శాస్త్రం నల్ల పిల్లిని చూడటం గొప్ప శుభ ఫలితాలను ఇస్తుందని చెబుతుంది. ఎవరికైనా నల్ల పిల్లి ఎదురుగా వచ్చినా, కనిపించినా లేదా కలలో కనిపించినా అది శుభ సంకేతం. ఇది అదృష్టాన్ని తెస్తుంది. మంచి రోజులు వస్తున్నాయనడానికి సంకేతం.
నల్ల పిల్లి కనిపిస్తే కొన్ని రోజుల్లోనే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెబుతారు. చాలా కాలంగా రాని డబ్బు, పెండింగ్ బిల్లులు లేదా పనిలో బకాయిలు (బకాయి వేతనాలు) పొందే అవకాశం ఉంది. ఇది ఆర్థిక విషయాలలో శుభ మార్పులను తెస్తుంది, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. నల్ల పిల్లి కనిపించిన 21 రోజుల్లో అదృష్టం పెరుగుతుందని కూడా నమ్ముతారు.
అంతేకాదు నల్ల పిల్లిని చూడటం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యంలో మెరుగుదల, శత్రువులు స్నేహితులుగా మారడం, ఉద్యోగంలో బదిలీ లేదా పదోన్నతి వంటి సానుకూల మార్పులు సంభవించవచ్చు.
కొంతమందికి గృహ యోగం, అంటే ఇంటి కొనుగోలు చేసే ప్రయత్నం ఫలించవచ్చు. కొత్త వాహనం లేదా ఆధ్యాత్మిక యాత్రను కూడా చేసే అవకాశం ఉంది. నల్ల పిల్లి కనిపించినప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా మీ ప్రయాణాన్ని కొనసాగించడం లేదా పని ప్రారంభించడం మంచిది. అటువంటి శుభ సంకేతం కనిపించినప్పుడు “ఓం నమో భగవతే వాసుదేవాయ” లేదా “ఓం కృష్ణాయ నమః” అనే మంత్రాలను మూడుసార్లు జపించడం ద్వారా, అదృష్టం వెంటనే కలిసి వస్తుందని చెబుతారు. ఈ నమ్మకాలన్నీ మన జీవితాల్లో సానుకూల ఆలోచనలను పెంచుతాయని వివరిస్తోంది శకున శాస్త్రం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








