AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: దీపావళికి ఇల్లు శుభ్రం చేస్తుంటే ఈ వస్తువులు కనిపిస్తే మీరు నక్క తోక తోక్కినట్లే..

దీపావళికి ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రపరచుకుంటారు. ఇది కేవలం ఇంటి అందంగా ఉంచేందుకు మాత్రమే కాదు.. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఇలా శుభ్రం చేసే ప్రక్రియకు ప్రత్యేకత ఉంది. ఇలా ఇంటిని శుభ్రపరిచే సమయంలో అనుకోకుండా కొన్ని రకాల వస్తువులు దొరికితే .. అది లక్ష్మీదేవి ఆశీస్సులకు చిహ్నంగా పరిగణించబడుతుంది.

Vastu Tips: దీపావళికి ఇల్లు శుభ్రం చేస్తుంటే ఈ వస్తువులు కనిపిస్తే మీరు నక్క తోక తోక్కినట్లే..
Diwali 2
Surya Kala
|

Updated on: Oct 14, 2025 | 8:52 PM

Share

వెలుగుల పండగ దీపావళి అక్టోబర్ 20న జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రతి సంవత్సరం దీపావళి పండగకు ఇంటిని శుభ్రం చేసుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళికి ముందు శుభ్రత చాలా కీలకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి శుభ్రమైన ఇళ్లలోనే ప్రవేశిస్తుంది. మీ ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు కొన్ని వస్తువులు కనిపిస్తే.. మీరు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడం ఖాయం అని జ్యోతిష్కులు చెబుతున్నారు. కనుక ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.

అకస్మాత్తుగా డబ్బు కనిపిస్తే దీపావళి శుభ్రపరిచే సమయంలో పాత పెట్టె లేదా డ్రాయర్ లోని డబ్బులు అకస్మాత్తుగా కనిపిస్తే అది యాదృచ్చికం కాదు.చాలా శుభ సంకేతం. ఇది మీ ఆర్థిక పరిస్థితి త్వరలో మెరుగుపడుతుందని.. చిక్కుకుపోయిన ఏదైనా డబ్బును తిరిగి పొందవచ్చని సూచిస్తుంది. అటువంటి డబ్బు విలువను తక్కువ అంచనా వేయకండి ..వెంటనే ఖర్చు చేయకండి. అలా దొరికిన డబ్బులను శుభ్రం చేసి పూజ చేసే చోట పెట్టండి. తరువాత దానిని ఎర్రటి గుడ్డలో చుట్టి మీ సేఫ్ లేదా అల్మారాలో భద్రపరచండి. అలా చేయడం వల్ల లక్ష్మిదేవి మీ ఇంటికి వస్తుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.

శంఖం లేదా గవ్వలు కనిపిస్తే శంఖం, గవ్వలు రెండూ సముద్ర మథనానికి సంబంధించినవని నమ్ముతారు. ఇవి ఇంటిని శుభ్రం చేసినప్పుడు కనిపిస్తే చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అవి లక్ష్మీదేవి, విష్ణువుతో నేరుగా ముడిపడి ఉన్నాయి. విష్ణువు ఎక్కడ నివసిస్తాడో అక్కడే లక్ష్మీదేవి కూడా శాశ్వతంగా నివసిస్తుందని నమ్ముతారు. శంఖం అంటే విష్ణువుకు ఇష్టం. కనుక ఇది సంపదకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కనుక దీపావళికి శుభ్రపరిచే సమయంలో మీకు శంఖం లేదా గవ్వలు కనిపిస్తే అది రాబోయే శ్రేయస్సుకు సంకేతమని అర్థం చేసుకోండి. వాటిని గంగా జలంతో శుద్ధి చేసి పూజ థనా స్థలంలో ఉంచండి. దీపావళి రోజున వాటిని భక్తితో పూజించండి.

ఇవి కూడా చదవండి

నెమలి ఈక: దీపావళికి శుభ్రం చేసేటప్పుడు నెమలి ఈక దొరకడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. హిందూ సంప్రదాయంలో నెమలి ఈకను శుభం , స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. ఇంకా నెమలి ఈక శ్రీకృష్ణుడు , సరస్వతి దేవితో ముడిపడి ఉందని నమ్ముతారు. ఇంట్లో నెమలి ఈక కనిపిస్తే ప్రతికూల శక్తి తొలగిపోతుందని, సానుకూలత ప్రబలుతుందనే సంకేతం అని చెబుతారు. ఇది ఇంట్లో వాస్తు దోషాలను తగ్గిస్తుందని, విజయాన్ని తెస్తుందని విశ్వాసం. నెమలి ఈకను ఎల్లప్పుడూ శుభ్రంగా , పవిత్రమైన ప్రదేశంలో ఉంచండి.

ఎరుపు బట్టలు హిందూ మతంలో ఎరుపు రంగు శక్తి, ధైర్యం, ప్రేమ, అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది లక్ష్మీదేవి , దుర్గాదేవి శక్తిని సూచించే రంగు. దీపావళికి శుభ్రం చేస్తున్నప్పుడు మీకు పాత పూజా వస్త్రం, చున్నీ లేదా ఎర్రటి వస్త్రం కనిపిస్తే దానిని అత్యంత శుభ సంకేతంగా పరిగణించండి. అంటే లక్ష్మీదేవి మీ పట్ల సంతోషంగా ఉందని.. మీ కోరికలు త్వరలో నెరవేరుతాయని అర్థం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
2026 మకరరాశి వారికి ఎలా ఉండనుందో తెలుసా? కెరీర్, ఆర్థిక పరిస్థితి
2026 మకరరాశి వారికి ఎలా ఉండనుందో తెలుసా? కెరీర్, ఆర్థిక పరిస్థితి
మరో వారంలో అలెన్ స్కాలర్‌షిప్ అడ్మిషన్ టెస్ట్ 2026.. సిద్ధమేనా?
మరో వారంలో అలెన్ స్కాలర్‌షిప్ అడ్మిషన్ టెస్ట్ 2026.. సిద్ధమేనా?
ఉన్న చోటే ఉంటూ నెలకు రూ.50 వేలు సంపాదించుకోవచ్చు!
ఉన్న చోటే ఉంటూ నెలకు రూ.50 వేలు సంపాదించుకోవచ్చు!
రూ. 43 కోట్లతో డాడీస్ జట్టు ర్యాంపేజ్ మాములుగా ఉండదు
రూ. 43 కోట్లతో డాడీస్ జట్టు ర్యాంపేజ్ మాములుగా ఉండదు
గంభీర్ పదవిపోతే.. ఈ ఆటగాడు టీమిండియాలో ఎప్పటికీ కనిపించడు
గంభీర్ పదవిపోతే.. ఈ ఆటగాడు టీమిండియాలో ఎప్పటికీ కనిపించడు
తరుచుగా ముఖం కడిగితే మొటిమలు తగ్గుతాయా.. అపోహలు కాదు వాస్తవాలు..
తరుచుగా ముఖం కడిగితే మొటిమలు తగ్గుతాయా.. అపోహలు కాదు వాస్తవాలు..
ఐఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌!
ఐఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌!