AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OG Movie OTT Date: త్వరలో ఓటీటీలో సందడి చేయనున్న పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ.. ఎప్పుడంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టి.. ఓ వైపు డిప్యూటీ సీఎంగా భాద్యతలు నిర్వహిస్తూనే మరోవైపు హీరోగా సినిమాల్లో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా అభిమానుల కోసం ఓ అభిమాని తీసిన సినిమా ఓజీ. సెప్టెంబర్ 25వ తేదీన రిలీజై.. బాక్సాఫీస్ వద్ద ఇంకా దండ యాత్ర చేస్తూనే ఉంది. అయితే ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ఇచ్చింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది

OG Movie OTT Date: త్వరలో ఓటీటీలో సందడి చేయనున్న పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ.. ఎప్పుడంటే
Og Ott Date Out
Surya Kala
|

Updated on: Oct 15, 2025 | 11:16 AM

Share

ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరక్కిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందు వచ్చింది. గ్యాంగ్ స్టర్ నేపధ్య కథతో తెరక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇప్పటికే దాదాపు 350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో పవన్ ను ఎలా అభిమానులు చూడాలని కోరుకుంటారో అదే విధంగా వింటేజ్ పవన్ కళ్యాణ్ చూపించాడు సుజిత్. అంటే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కోసం పవన్ కళ్యాణ్ అభిమాని తెరకెక్కించిన సినిమా ఓజీ అన్నమాట.

ఈ గ్యాంగ్ స్టార్ యాక్షన్ మూవీ కి సంబందించిన ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా త్వరలో బుల్లి తెరపై అంటే ఓటీటీలో సందడి చేయనుంది. దీపావళి తర్వాత ఇంటిలో బుల్లి తెరపై వెలుగులు విరజిమ్మ నుందని అంటే అక్టోబర్ 23వ తేదీ గురువారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓజీ దే కాల్ హిమ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ హక్కులను రూ.94 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎక్కడా ప్రకటన వెలువడలేదు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by OTT 🎬 (@ottnights)

పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా అరుళ్ మోహన్ నటించింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా నిలిచిన ఈ సినిమాను DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై DVV దానయ్య నిర్మించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..