AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konaseema: 47 తర్వాత ఘనంగా దాసులమ్మ పంటల జాతర.. సారె, గండ్ర దీపాలు సమర్పించిన మహిళలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిలాల్లో ముమ్మిడివరం మండలం చెయ్యేరు లో అంగరంగ వైభవంగా దాసులమ్మ పంటల జాతర జరిగింది. అమ్మవారి అనుగ్రహం ఉండాలని.. తమ గ్రామంలో కరువుకాటకాలు రాకుండా సుభిక్షంగా ఉందని జాతరను జరుపుకున్నారు. గ్రామానికి చెందిన ఆడపడుచులు, కోడళ్ళు అందరూ అఖండ జ్యోతిని వెలిగించి ఊరేగింపుగా ఆలయానికి తరలి వెళ్లి సమర్పించారు.

Konaseema: 47 తర్వాత ఘనంగా దాసులమ్మ పంటల జాతర.. సారె, గండ్ర దీపాలు సమర్పించిన మహిళలు
Panta Jatara In Konaseema
Surya Kala
|

Updated on: Oct 14, 2025 | 7:50 PM

Share

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చెయ్యేరు లో గ్రామ దేవత దాసులమ్మ పంటల జాతర 47 ఏళ్ల తరువాత అంగరంగ వైభవం గా నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతులు పంటలు పుష్కలంగా పండి గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ అమ్మవారికి అఖండ దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామం లో వేలాది మంది మహిళలు (ఆడపడుచులు,కొడళ్లు బంధువులు) అందరూ తమ ఇంటి వద్ద అఖండ జ్యోతి ని వెలిగించి.. ఆ జ్యోతిని నెత్తిమీద పెట్టుకుని పసుపు, కుంకుమలు, వివిధ రకాల పిండి వంట తో ఊరంతా తిరిగి ఊరేగింపు గా తరలి వెళ్లి అమ్మవారికి సారె, గండ్ర దీపాలను సమర్పించారు.

వివిధ రకాల ఆహార పదార్ధాలను నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామస్తులు తీసుకువచ్చిన నైవేద్యాలను అమ్మవారికి కుంభంగా పోశారు. అనంతరం ఆ ప్రసాదాన్ని గ్రామంలో ఇంటి ఇంటికి పంచుతారు. ఇలా చేయడం ఇక్కడ ఆనవాయితి. అంతేకాదు అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని విశ్వసిస్తారు. వాస్తవంగా దాసులమ్మ పంటల జాతర ప్రతీ ఐదేళ్లకోసారి జరుపుకునెవరు. అయితే ఈ జాతరను కొన్నేళ్లుగా నిలిపివేశారు. దీంతో ఆనావృష్టి తో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు భావించి 47 ఏళ్ల తరువాత మరలా ఈ జాతర వైభవంగా జరుపుతునట్లు గ్రామస్థులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి