AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..

కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువ అని అంటారు పెద్దలు.. అయితే మారుతున్న కాలంతో పాటు.. ప్రేమలు, అభిమానాలు అన్నిటిలోనూ మార్పులు వచ్చాయి. చివరకు కడుపున పిల్లలే తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు. ఆస్థి తీసుకుని రోడ్డుపాలు చేస్తున్న వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. ఇప్పుడు కన్న పిల్లలే అలా చేస్తుంటే.. పెంపుడు కూతురుని నేను మాత్రం తక్కువా అనుకునట్లు ఉంది.. తనని పెంచి పెద్ద చేసిన వృద్ధ దంపతులకు బిగ్ షాక్ ఇచ్చింది. పొలం తన పేరున రాయించుకుంది. ఆశకు హద్దు లేదన్నట్లు.. ఇప్పుడు వారున్న ఉంటున్న ఇంటికే ఎసరు పెట్టింది. ఈ ఘటన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
Andhra Pradesh News
Surya Kala
|

Updated on: Oct 14, 2025 | 5:30 PM

Share

కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం మొగళ్లమూరు గ్రామంలో వెంకటనర్సయ్య, లక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు సొంత ఊరుని వదిలి బతుకుదెరువు కోసం అండమాన్‌ వెళ్లి.. టైలరింగ్ చేసుకుంటూ.. మొగళ్లమూరు గ్రామంలో ఎకరాల 18 సెంట్లు భూమిని కొనుకున్నారు. అయితే ఈ దంపతులకు పిల్లలు లేరు. దీంతో తమ బంధువుల అమ్మాయిని చేర దీశారు. పెంపుడు కూతురు జ్యోతిని పెంచి పెద్ద చేసి వీరవెంకట సత్యనారాయణ అనే యువకుడితో కట్న కానులను ఇచ్చి ఘనంగా పెళ్లి కూడా చేశారు.

పెళ్లి అయిన తర్వాత జ్యోతి తల్లిదండ్రుల ఆస్తిమీద కన్నేసింది. తండ్రి పెరుమీరున్న భామిని తన పేరుని రాసి ఇవ్వమని కోరింది. కూతురు అడగడంతో వెనుక ముందు చూసుకోకుండా పొలం జ్యోతి పేరుమీద రాశారు. అంతేకాదు అండమాన్‌లో తండ్రి పేరున ఉన్న షాపులను కూడా స్వాధీనం చేసుకుని అద్దె కూడా ఇవ్వకుండా తమ సొంతానికి వాడుకోవడం మొదలు పెట్టారు. తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిని కూడా తన పేరుమీద రాసివ్వాలని అడగడం మొదలు పెట్టింది.

కుమార్తె అసలు స్వరూపం తెలుసుకున్న వెంకటనర్సయ్య, లక్ష్మి దంపతులు ఇప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమని తమ కుమార్తె చాలా కాలం నుంచి చూడడం లేదని.. తమ దగ్గర డబ్బులు సైతం తమకు తెలియకుండా కూతురు అల్లుడు కలిసి కాజేశారని వాపోయారు. అంతేకాదు వృద్ధాప్యంలో అనారోగ్యం పాలైనా అసలు పట్టించుకోవడం లేదని తాము డబ్బులకు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామని అధికారులకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

తమ వృద్ధాప్యంలో చూస్తుందన్ననమ్మకంతో పెంపుడు కూతురుకి ఆస్తిని అంతటినీ రాసిచ్చామని .. ఇప్పుడు తమ వైపు కన్నెత్తి చూడడం లేదంటూ ని వాపోయారు. తమకు తమ చివరి దశలో ఆర్ధిక భరోసా కల్పించేందుకు జ్యోతి పేరు మీద రాసిన దాన సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసి.. తిరిగి తమ ఆస్తిని తమకు ఇప్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

మరిని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..