AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kubera Temple: మన దేశంలో కుబేరుడికీ గుడి ఉందని తెలుసా.. ఒక్కసారి దర్శించుకున్నా.. జీవితంలో డబ్బుకి ఇబ్బందే ఉండదు..

దేవ భూమి ఉత్తరాఖండ్‌లో అందమైన పర్యాటక ప్రాంతమే కాదు.. అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయం కూడా.. ఇక్కడ ఉన్న జగేశ్వర్ ధామ్ చాలా పవిత్రమైనది. ఇది 124 చిన్న మరియు పెద్ద ఆలయాల సమూహానికి నిలయం. వీటిలో కుబేర భండారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో కుబేరుడిని శివుడిగా పూజిస్తారు. దీని వెనుక ఉన్న రహస్యం.. లింగ రూపంలో కుబేరుడు ఎందుకు పూజలను అందుకుంటున్నాడు. పురాణ కథ ఏమిటి? తెలుసుకుందాం.

Kubera Temple: మన దేశంలో కుబేరుడికీ గుడి ఉందని తెలుసా.. ఒక్కసారి దర్శించుకున్నా.. జీవితంలో డబ్బుకి ఇబ్బందే ఉండదు..
Kuber Bhandari Temple
Surya Kala
|

Updated on: Oct 14, 2025 | 3:05 PM

Share

దేశవ్యాప్తంగా అనేక చిన్న, పెద్ద అనేక పురాతన శివాలయాలు ఉన్నాయి. ఇక్కడ శివుడిని వివిధ రూపాల్లో పూజిస్తారు. అలాంటి శివాలయం ఒక ఉత్తరాఖండ్‌లో కూడా ఉంది. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమావున్ హిమాలయ సానువులో ఉన్న జగేశ్వర్ ధామ్ ఆధ్యత్మికంగానే కాదు వాస్తుశిల్పానికి అత్యుత్తమ ఉదాహరణలలో ఒకటిగా నిలుస్తుంది. ఇక్కడ 124 చిన్న, పెద్ద ఆలయాల సమూహం ఉంది. వీటిలో కుబేర భండారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో కుబేరుడిని శివుడిగా పూజిస్తారు. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? తెలుసుకుందాం..

యక్ష రాజు కుబేరుడు సంపదకు దేవుడిగా భావిస్తారు. ఆయన లంక నగరాన్ని పాలించే వాడు. అయితే అతని సవతి సోదరుడు రావణుడు చేతిలో ఓడిపోయాడు.అప్పుడు రావణుడు .. కుబేరుడి మొత్తం రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు.ఆ తరువాత కుబేరుడు హిమాలయాల్లోని అలకా అనే నగరంలో స్థిరపడ్డాడు

కుబేరుని భక్తికి శివుడు సంతోషం రావణుడి చేతిలో ఓటమి తర్వాత కుబేర మహారాజు హృదయం బంగారం, వెండి లేదా సంపద కోసం ఆరాటపడటం మానేసి.. మానసిక శాంతిని కోరుకున్నాడు. అదే సమయంలో సతీ మరణం తర్వాత శివుడు ధ్యానం చేసిన లోయ వద్దకు కుబేరుడు వచ్చాడు. అప్పుటికే ఆ లోయలోని గాలి శివుని తపస్సుచే ప్రభావితమైంది. ఆ గాలి తగలడంతో కుబేరుడికి ఉపశమనం కలిగింది. దీంతో బేర మహారాజు మోకాళ్లపై నిలబడి శివుడిని ప్రార్థించాడు. కుబేరుడి భక్తికి శివుడు సంతోషించాడు.

ఇవి కూడా చదవండి

దర్శనంతోనే కోరికలు నెరవేరుతాయి కుబేరుడి భక్తికి మెచ్చిన శివుడు.. కుబేరుడి ఆశీర్వదించి.. కుబేరుడు నిలబడి ఉన్న లోయలో నివాసానికి అనుమతినిచ్చాడు. తాను ఇక్కడే కొలువు ఉంటానని వరం ఇచ్చాడు. ఆ రోజు నుంచి జగేశ్వర్ ధామ్ కుబేరుడికి నివాసంగా మారింది.సంపదలకు అధిపతిగా.. సంపదను పంపిణీ చేసే బాధ్యతను కలిగి ఉన్న కుబేరుడు లక్ష్మీదేవికి సహాయకుడిగా పరిగణించబడుతున్నాడు. ఇక్కడే కుబేరుడు.. శివుడిని పూజించి, శ్రేయస్సు కోసం ఆశీస్సులు పొందాడని నమ్ముతారు. ఇక్కడ నిర్మలమైన హృదయంతో శివుడిని, కుబేరుదిను పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని.. జీవితంలో సంపదకు కొరత ఏర్పడదని చెబుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు