- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti: These are the life lessons every human should learn from a dog in telugu
Chanakya Niti: కుక్క నుంచి ఈ లక్షణాలు నేర్చుకున్న మనిషికి జీవితంలో ఓటమే ఉండదన్న చాణక్య
ఈ భూమిపై కుక్క అంత విశ్వాసపాత్రమైన జంతువు మరొకటి లేదు. అవును అవి ఒక్కసారి మనిషిని నమ్మితే జీవితాంతం విశ్వాసంగా ఉంటాయి. ఒక్కసారి ఆహారం పెడితే వారిని గుర్తుంచుకుంటాయి. ప్రేమను చూపుతాయి. అటువంటి విశ్వాసపాత్రమైన జంతువు కుక్క నుంచి మనిషి నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయని మరీ ముఖ్యంగా నాలుగు లక్షణాలను నేర్చుకోవాలని ఆచార్య చాణక్య చెప్పాడు. అవి ఏమిటో తెలుసుకుందాం.
Updated on: Oct 13, 2025 | 8:27 PM

మనిషి మచ్చిక చేసుకుని ఇంటికి కాపలా కోసం పెంచుకోవడం మొదలు పెట్టిన కుక్క.. నేడు కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మారిపోయింది. అత్యంత విశ్వాసపాత్రమైన జంతువు. తమ ఆకలిని తీర్చిన వ్యక్తులను, ప్రేమ , ఆప్యాయతలను చూపించిన యజమానులను జీవితాంతం గుర్తుంచుకుంటాయి. తమ యజమాని కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా అవి సిద్ధంగా ఉంటాయి. తమ యజమానులను రక్షించడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన కుక్కలకు సంబంధించిన అనేక వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం. అటువంటి విశ్వాసపాత్రమైన కుక్క నుంచిమానవులు చాలా నేర్చుకోవాలి అని చాణక్య తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. అవును, తన స్వార్థం కోసం ఇతరుల ఆనందాన్ని నాశనం చేసే వ్యక్తి కుక్క నుంచి జీవిత పాఠం నేర్చుకోవాలని సూచించాడు. ఆ జీవిత పాఠాలు ఏమిటో తెలుసుకుందాం..

తమకు లభించే దానితో సంతృప్తి చెందడం: కుక్కలు తమకు లభించే దానితో సంతృప్తి చెందుతాయి. అవి ఎండిన రొట్టె దొరికినా దానిని చాలా ఆనందంగా తింటాయి. చేపలు దొరికిన అంతే సంతృప్తిగా తింటాయి. కుక్కుల నుంచి ఈ గుణం జీవితంలో మనకు లభించిన దానితో సంతృప్తి చెందడాన్ని నేర్పుతుందని చాణక్యుడు చెప్పాడు. ఆహారం విషయంలో మనం తినే ఆహారాన్ని గౌరవించాలి.

గాఢ నిద్రలో కూడా అప్రమత్తంగా ఉండటం : కుక్క గురించి అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే..కుక్క గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా, చిన్న శబ్దం విన్న వెంటనే మేల్కొంటుంది. ఈ గుణం మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని , మన పని విషయంలో జాగరూకతతో ఉండాలని మనకు బోధిస్తుంది. మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా మన లక్ష్యాలు , బాధ్యతల గుర్తుంచుకోవాలి. జీవితంలోని ప్రతి సవాలుకు సిద్ధంగా ఉండటమే విజయానికి కీలకం అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.

విధేయత: కుక్కలు వాటి యజమానులకు చాలా విధేయంగా ఉంటాయి. అవి వాటి యజమానులను రక్షించుకోవడానికి తమ ప్రాణాలను పణంగా పెడతాయి. ఈ గుణం మనకు మన కుటుంబం, స్నేహితులు, సమాజం పట్ల విధేయంగా ఉండాలని నేర్పుతుంది. మనకు మంచి చేసే వారి పట్ల మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో, నిజాయితీగా ఉండాలి. అదేవిధంగా వ్యక్తి తాను చేసే పని పట్ల విధేయతతో ఉండాలి. మోసం చేయకూడదని చాణక్యుడు చెప్పాడు.

నిర్భయం, ధైర్యం: చాణక్య నీతి ప్రకారం మనుషులు నిర్భుయం, ధైర్యం అనే లక్షణాలను కుక్కల నుండి నేర్చుకోవాలి. కుక్క అనేది తన యజమానికి హాని కలిగించే ఎవరినైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది. తన యజమానిని రక్షించడానికి తన ప్రాణాలను పణంగా పెడుతుంది. అదేవిధంగా, ఒక వ్యక్తి ఎల్లప్పుడూ నిర్భయంగా ఉండాలి. తద్వారా అతను కష్టాలను ధైర్యంగా ఎదుర్కోగలడు. అలాగే ఈ గుణం మన లక్ష్యాలను, సూత్రాలను రక్షించుకోవడానికి మనం నిర్భయంగా నిలబడాలని మనకు బోధిస్తుంది. జీవితంలో అన్యాయాన్ని వ్యతిరేకించే సందర్భం వచ్చినప్పుడు, మనం దానిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఇది మనకు బోధిస్తుంది.




