Feng Shui Butterfly: సీతాకోకచిలుక పెయింటింగ్ ను ఇంట్లో పెట్టుకుంటే ఎన్ని లాభాలో తెలుసా
ప్రకృతిలో సీతాకోక చిలుకకు విశిష్టమైన స్థానం ఉంది. గొంగళి పురుగు నుంచి అందమైన సీతాకోకచిలుకలు రూపాంతరం చెందుతాయి. అందానికి, ఆనందానికి చిహ్నం సీతాకోకచిలుక. కనుక సీతాకోక చిలుక పెయింటింగ్ ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. జీవితంలో సానుకూల మార్పులను, వ్యక్తిగత వృద్ధికి తోడ్పడుతుంది. సీతాకోక చిలుక పెయింటింగ్ ఇంటి అలంకరణలో భాగంగా చేర్చుకుంటుననరా.. ఫెంగ్ షుయ్ ప్రకారం కొన్ని నియమాలున్నాయి. వాటిని పాటించి మీ సంబంధాలకు మాధుర్యాన్ని జోడించండి.

జ్యోతిష్య, వాస్తు శాస్త్రం వలెనే ఫెంగ్ షుయ్ కూడా ఒక ప్రముఖ శాస్త్రం. ఇది ఇళ్ళు , ఆఫీసులో సానుకూల శక్తిని పెంపొందించడానికి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రసిద్ధి చెందిన ఒక పురాతన చైనీస్ అభ్యాసం. ఫెంగ్ షుయ్‌లో సీతాకోకచిలుకలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వీటిని ప్రేమ, అందం, స్వేచ్ఛకు చిహ్నంగా భావిస్తారు. ఇంటి అలంకరణలో సీతాకోకచిలుక పెయింటింగ్‌ను జోడించడం వల్ల సంబంధాలకు మాధుర్యాన్ని తీసుకురావడానికి .. ఆనందాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
ఫెంగ్ షుయ్‌లో సీతాకోకచిలుక ప్రాముఖ్యత
ప్రేమ, సంబంధాల బలోపేతం కోసం: సీతాకోకచిలుకలను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో సీతాకోకచిలుక పెయింటింగ్ ఉంచడం వల్ల సాన్నిహిత్యం పెరుగుతుంది. సంబంధంలో మాధుర్యాన్ని కాపాడుతుంది.
ఆనందాన్ని తెస్తుంది: ఫెంగ్ షుయ్ ప్రకారం సీతాకోకచిలుక పెయింటింగ్‌లు ఇంట్లోకి సానుకూల వైబ్‌లను తీసుకువస్తాయి. కాంతి , ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని నమ్ముతారు .
పిల్లల సృజనాత్మకతను పెంచడం: పిల్లల గదిలో సీతాకోకచిలుక చిత్రాన్ని ఉంచడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం, సృజనాత్మక ఆలోచన అభివృద్ధి చెందుతాయి.
కొత్త అవకాశాలు, వృద్ధి: సీతాకోకచిలుక మార్పు, కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. దీని పెయింటింగ్ ను ఇంట్లో ఉంచడం వల్ల జీవితంలో పెరుగుదల, కొత్త అవకాశాలు లభిస్తాయి.
సీతాకోకచిలుకలు స్వేచ్ఛగా ఎగురుతాయి కనుక వీటి చిత్రాలు జీవితంలో స్వేచ్ఛ , విముక్తిని సూచిస్తాయి. వీటి పెయింటింగ్ ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. సీతాకోకచిలుక పెయింటింగ్‌ను ఇంటికి లేదా ఆఫీసులో కనిపించే ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇష్టమైన రంగులను ఎంచుకోవచ్చు. ఫెంగ్ షుయ్ సీతాకోకచిలుక పెయింటింగ్‌లు ఇంటి అందాన్ని పెంచడమే కాదు సంబంధాలకు ప్రేమను, కుటుంబానికి ఆనందాన్ని , జీవితానికి సానుకూలతను కూడా తెస్తాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాలనుకుంటే అలంకరణలో భాగంగా సీతాకోకచిలుక పెయింటింగ్‌లను చేర్చుకోండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








