AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాలకు కొట్టుకుపోయిన వంతెన.. భుజాల మీద ఆటో వేసుకుని నది దాటుతున్న గ్రామస్తులు

భారీ వర్షాలకు తాము ప్రయాణించే మార్గంలో ఉన్న వంతెన కొట్టుకుపోయిన తర్వాత గ్రామస్తుల ప్రయాణం ఒక సవాల్ గా మారింది. రవాణా సదుపాయాలు, ప్రయాణించడానికి సరైన రహదారి లేక పోవడంతో కొంత మంది గ్రామస్తులు తమ భుజాల మీద ఆటో రిక్షాను మోసువెళ్లి నదిని దాటించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వర్షాలకు కొట్టుకుపోయిన వంతెన.. భుజాల మీద ఆటో వేసుకుని నది దాటుతున్న గ్రామస్తులు
Villagers Carry An Auto Rickshawa
Surya Kala
|

Updated on: Oct 05, 2025 | 1:53 PM

Share

జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో భారీ వర్షాలు భీభత్సం సృష్టించాయి. జిల్లాలోని బంట్ గ్రామంలో భారీ వర్షం కారణంగా ఒక కీలకమైన వంతెన కొట్టుకుపోవడంతో నివాసితులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రవాణా మార్గాలు లేకపోవడంతో నదిని దాటాల్సి వస్తుంది. కొంతమంది గ్రామస్తులు తమ భుజాలపై ఆటో రిక్షాను మోసుకెళ్ళి నదిని దాటారు. దీనికి సంబధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నదిమీద వంతెన 10 సంవత్సరాల తర్వాత కొట్టుకుపోయిందని స్థానికులు చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నదిపై వంతెనను నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

“దాదాపు 10 సంవత్సరాల తర్వాత.. ఈ వంతెన భారీ వర్షాల కారణంగా కొట్టుకుపోయింది… మేమందరం వంతెన నిర్మాణం గురించి ప్రభుత్వంలోని ప్రతి విభాగాన్ని సంప్రదించాము. డిసి వద్దకు వెళ్లి ఎమ్మెల్యేకు కూడా విజ్ఞప్తి చేసాము.. అయిన ఎవరూ మా మాట వినలేదు. పేదల గొంతు కేంద్రానికి చేరేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లలు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు నదిని దాటేందుకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మాకు రవాణా మార్గాలు లేవు. ఇక్కడి నుంచి సమరోలికి నడిచి వెళ్ళడానికి మాకు నాలుగు గంటలు పడుతుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

స్కూల్ పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు.. ఎవరైనా సరే నది దాటాల్సిందే. ఇది చాలా లోతైన నది. ప్రభుత్వంలోని ఏ శాఖ కూడా మాకు అస్సలు సహాయం చేయలేదు. నది దాటడం భయంగా ఉంది.. అయినా తప్పడం లేదు.. అని చెప్పారు.

రాష్ట్రంలోని భదేర్వా ప్రాంతం మేఘావృతాలు, ఆకస్మిక వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు ఇటీవలి ఉగ్రవాద దాడుల కారణంగా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం నిర్జనమైపోయింది. జీవనోపాధి కోసం పర్యాటక రంగంపై ఎక్కువగా ఆధారపడే స్థానికులు ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిశ్రమను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

View this post on Instagram

A post shared by NEWS9 (@news9live)

పర్యాటక రంగంపై ఆధారపడిన స్థానికుడైన యాసిర్ మాట్లాడుతూ.. తాను గత 8-10 సంవత్సరాలుగా పర్యాటక రంగంలో పనిచేస్తున్నాను. గత ఎనిమిది సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితులను నేను ఎప్పుడూ చూడలేదు. పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ నిశ్శబ్దాన్ని మీరు చూడవచ్చు. పహల్గామ్ దాడి తర్వాత.. రెండున్నర నెలలుగా పర్యాటకులు పూర్తిగా లేరు. వేసవి కాలం వచ్చిన తర్వాత పర్యాటకులలో 30 శాతం మంది ఇక్కడికి వచ్చారు. అయితే కిష్త్వార్‌లో వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా చాలా మంది నష్టపోయారు. ఇకపై ఎవరూ ఇక్కడికి రావడానికి ఇష్టపడరు.” భదేర్వా పర్యాటక రంగం సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించాలని, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఉత్సవాలు నిర్వహించాలని ఎమ్మెల్యేను కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..