AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓట్లు కావాలంటే.. కోతులు పోవాల్సిందే.. సర్పంచ్‌ అభ్యర్థుల ఎదుట సరికొత్త డిమాండ్

సాధారణంగా ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చిన ప్రజాప్రతినిధులను ప్రజలు ఏమి అడుగుతారు. తమ గ్రామానికి కావలసిన వసతులు, స్కూల్‌, హాస్పిటల్‌ వంటి వాటిని ఏర్పాటు చేయమని అడుగుతారు. కానీ ఇక్కడో గ్రామంలో మాత్రం ఓట్లు అడిగేందుకు వచ్చిన ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి విచిత్ర డిమాండ్‌లు వచ్చాయి. ఆ డిమాండ్‌లు విన్న నేతలు అవాక్కవుతున్నారు. ఇంతకు ప్రజలు చేస్తున్న ఆ డిమాండ్‌ ఏంటో తెలుసుకుందాం పదండి.

ఓట్లు కావాలంటే.. కోతులు పోవాల్సిందే.. సర్పంచ్‌ అభ్యర్థుల ఎదుట సరికొత్త డిమాండ్
Karimnagar News
G Sampath Kumar
| Edited By: Anand T|

Updated on: Oct 05, 2025 | 3:27 PM

Share

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెజారిటి గ్రామాల్లో కోతుల సమస్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో గ్రామంలో ఎక్కడ చూసిన కోతులు సంచరిస్తున్నాయి. చాలా మందిపై దాడులుకు కూడా దిగుతున్నాయి. అసలు అక్కడ మనుషుల కంటే కోతుల సంఖ్య ఎక్కువ ఉన్నట్టు పరిస్థితి నెలకొంది. దీంతో మనుషులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అయితే ఈ సమస్యపై గతంలో చాలా సార్లు స్థానికులు అట శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు స్పందించడం లేదు.

ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఆశావాహులు ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు. ఇంకా అభ్యర్థులను ప్రకటించకున్నా. ఆశావాహులు ఇంటి ఇంటికి వెళ్తున్నారు. అలా వెళ్లిన నేతలకు. కోతులను సమస్య గురించి ప్రస్తావిస్తున్నారు స్థానికులు. కోతులను తరిమి వేయాలని కోరుతున్నారు. అలా అయితేనే మీకు ఓటు వేస్తామని చెబుతున్నారు. దాదాపునా స్థానికంగా ఉన్న అన్ని గ్రామాల్లో ఇదే సమస్య ఉంది. దీంతో ఓట్లు అడగానికి వచ్చిన ప్రతి నేత దృష్టికి ఇదే సమస్యను తీసుకెళ్తున్నారు స్థానికులు.

ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన అశావాహులు కూడా సమస్యను తీరుస్తామని హామి ఇస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు అభ్యర్థులు కూడా ఈ సమస్య పై ఫోకస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సమస్యను తీరుస్తామని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.