Vision Test: ఈ అంకెల్లో దాగున్న 574 బేసి సంఖ్యను 7 సెకన్లలో కనిపెడితే మీరు తోపు..
మనిషి తెలివి తేటలకు, పరిశీలన శక్తికి పరీక్ష పెట్టే రకరకాల పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సోషల్ మీడియాలో తరచుగా చక్కర్లు కొడుతూ ఉంటాయి. కొన్ని మెదడుకు పదును పెడితే.. మరికొన్ని చూపులోని పదునిని తెలియజేస్తాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో ఒక చిక్కుముడి దాగుంది. ఇందులో ఒకే అంకె '374' సముద్రంలా ఉన్నాయి.. ఇందులో 574 బేసి సంఖ్య దాగుంది. ఈ సంఖ్యని కేవలం 7 సెకన్లలో కనిపెడితే మీరు తోపు

ఆప్టికల్ భ్రమలు మనస్సును మోసగించడానికి, చూపు నిజంగా ఎంత పదునైనదో పరీక్షించడానికి ఒక మార్గం. గజిబిజి లెక్కలతో చిక్కులతో.. చిత్రాల మధ్య దాగున్న చిత్రంతో మనల్ని సవాలు చేస్తాయి. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోన్న తాజా బ్రెయిన్-టీజర్ అంకెల మధ్య గారడీ. ఈ చిత్రంలో ‘374’ అంకె అనేక వరసలుగా దాగుతుంది. ఈ అంకెల మధ్య దాగి ఉన్న బేసి సంఖ్య ‘574’ ను కనుగొనమని మీ కంటి చూపుకి పరీక్ష పెడుతోంది. చూడడానికి ఇది చాలా సింపుల్ గా అనిపించవచ్చు. అయితే ఈ సవాలుకు సమాధానం కేవలం 7 సెకన్లలోపు కనిపెట్టాలి. విజయం సాధించిన వారికి అద్భుతమైన ఏకాగ్రత, డేగ లాంటి దృష్టి ఉందని లెక్క.
ఈ పజిల్ ఇమేజ్ లో “374” అనే సంఖ్య అంతా నిదిపోయి ఉంది. అయితే ఈ అంకెలో ఒక చోట రహస్యంగా “574” దాగి ఉంది. ఈ బేసి సంఖ్యను మొదటి చూపులో గుర్తించడం చాలా కష్టం. అయితే మీ కంటి చూపుని అటుఇటు తిప్పుతూ బేసి సంఖ్యను వెదకడానికి బదులుగా పజిల్‌ను వరుసగా వరుసగా స్కాన్ చేయదని. అంకెలపై నిశితంగా దృష్టి పెట్టడం కీలకం.
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు చూడడానికి చాలా సింపుల్ గా అనిపించినా.. వాస్తవంగా ఇవి అభిజ్ఞా ప్రయోజనాలను కలిగి ఉంటాయి. సూక్ష్మమైన తేడాలను కనిపెట్టడానికి ప్రయత్నించడం వలన మెదడుకి పదును పెట్టేందుకు ఒక శిక్షణ అవుతుంది. చిన్న మార్పులను వేగంగా గుర్తించడం, దృష్టి , ఏకాగ్రత , వంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఇలాంటి మెదడుకి వ్యాయామాల ద్వారా నైపుణ్యాలను పదును పెడతారు.
‘374’ అంకెల మధ్య “574 సంఖ్య ఎక్కడుందంటే
ఇప్పుడు మీ నైపుణ్యాలను పరీక్షించుకోవడం మీ వంతు. ‘374’ అంకెల మధ్య ఉన్న “574”ని కేవలం 7 సెకన్లలో కనుగొనగలరా? మీరు అలా చేస్తే.. అభినందనలు. మీకు పదునైన దృష్టి.. పరిశీన శక్తి ఉన్నట్లు. మీకు సమాధానం తెలుసుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టినా.. చింతించకండి. క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా.. మీ పరిశీలన నైపుణ్యం మెరుగుపడుతూనే ఉంటుంది.

Eye Test 1
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








