Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత దేశం వెలుపల అమ్మవారి ఆలయం.. బ్యాంకాక్‌లో శక్తిస్వరూపిణి కాళికగా పూజలు

భారతదేశంలో మాత్రమే కాదు హిందూ మూలాలున్న శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో కూడా అమ్మవారి ఆలయాలు శక్తి పీఠాలు ఉన్నాయి. పురాతన కాలం నుంచి కాళీ దేవిని పూజిస్తున్నారు. అయితే మన దేశం వెలుపల కూడా కాళి దేవి ప్రత్యేక పూజిస్తారని మీకు తెలుసా? అవును థాయిలాండ్ లో శ్రీ మహా ప్రత్యంగిర కాళికా దేవి ఆలయం ఉంది. దీనినే శ్రీ మహా మరియమ్మన్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం భక్తులు, పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

భారత దేశం వెలుపల అమ్మవారి ఆలయం.. బ్యాంకాక్‌లో శక్తిస్వరూపిణి కాళికగా పూజలు
Sri Mariamman Temple Bangkok
Surya Kala
|

Updated on: Sep 30, 2025 | 11:27 AM

Share

భారతదేశం వెలుపల దేవతలకు అంకితం చేయబడిన దేవాలయాలున్నాయని.. అవి భారతీయ సంస్కృతి,విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయా అని మీకు తెలుసా? అవును.. అది నిజం. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో, కాళీకాదేవి అద్భుతమైన, ప్రత్యేకమైన విగ్రహాన్ని కలిగి ఉన్న ఒక ఆలయం ఉంది. బ్యాంకాక్‌లోని సిలోమ్ ప్రాంతంలోని శ్రీ మహా ప్రత్యంగిరా కాళికా దేవి ఆలయంలో కొలువుదీరిన కాళీమాతను ప్రత్యంగిరా దేవిగా భక్తులు పూజిస్తారు.

తల్లి ప్రత్యంగిర ఎవరు?

ఈ ఆలయంలో ప్రధాన దేవత ప్రత్యంగిర దేవి. సింహం ముఖం గల రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ అమ్మవారు కాళికాదేవి ఉగ్ర స్వరూపంగా భక్తుల నమ్మకం. ఈ రూపం ప్రతికూల శక్తులను నాశనం చేయడం ద్వారా రక్షణ కల్పిస్తుందని భక్తులు విశ్వాసం. ప్రత్యంగిరను సాధారణ పద్దతిలో పూజించారు. ఈ అమ్మవారికి చేసే పూజ ఒక ప్రత్యేకమైన, రహస్యమైన ఆచారంగా పరిగణించబడుతుంది. సాంప్రదాయకంగా గురువు మార్గదర్శకత్వంలో అమ్మవారి పూజ నిర్వహించబడుతుంది.

విశ్వాసానికి సంబంధించిన

బ్యాంకాక్‌లో ప్రత్యంగిర దేవి అమ్మవారిని దేవాలయంలో మాత్రమే కాదు స్థానిక చేతి పనుల కళాకారుల దగ్గర కూడా చూడవచ్చు. థాయ్ కళాకారులు కాళికాదేవి అద్భుతమైన కాంస్య విగ్రహాలను సృష్టిస్తారు. ఈ విగ్రహాలు దేవతను ఉగ్ర రూపంలో వర్ణిస్తాయి.

ఇవి కూడా చదవండి

ప్రత్యంగిర దేవి అనేక చేతుల్లో ఆయుధాలు పట్టుకుని.. చిందరవందరగా ఉన్న జుట్టుతో.. దంతాలు, నాలుక బయటకు పొడుచుకు వచ్చినట్లుగా, శివునిపై నిలబడి ఉంటుంది. ఈ శిల్పం కాళికా రూపాన్ని సూచిస్తుంది, ఈ రూపంలో అమ్మవారు చెడును తొలగించి.. విశ్వానికి సమతుల్యతను తెస్తుందని నమ్మకం.

బలానికి చిహ్నంగా భావించే భక్తులు

కాళికా రూపం కేవలం విధ్వంసానికి చిహ్నం మాత్రమే కాదు. నిజానికి ఆమె ఉగ్ర రూపం చెడుని, ప్రతికూల అంశాలను నాశనం చేస్తుంది. కొత్త సృష్టికి మార్గం సుగమం చేస్తుంది. అందుకే భక్తులు ఆమెను రక్షణ ఇచ్చే శక్తిగా భావిస్తారు. బ్యాంకాక్‌లో ఆమె ఉనికి సనాతన ధర్మం, హిందూ విశ్వాసాలు భారతదేశానికే పరిమితం కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల జీవితాల్లో, సంస్కృతిలో భాగమయ్యాయనేదానికి నిదర్శనం.

థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లోని శ్రీ మహా ప్రత్యంగిర కాళికా దేవి ఆలయం కేవలం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు.. భారతీయ ఆధ్యాత్మికత ప్రపంచవ్యాప్తంగా ఎంతగా వ్యాప్తి చెందిందో తెలియజేస్తుంది. కాళి మాత మనం ఎక్కడ ఉన్నా.. ఆమె శక్తి, రక్షణ, సందేశం సమానంగా శక్తివంతమైనవి, స్ఫూర్తిదాయకమైనవని ప్రతి ఒక్కరికీ తెలియజేస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు