AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవరాత్రి 8వ రోజున మహాగౌరికి కొబ్బరి పాయసం సమర్పించండి.. రెసిపీ చాలా సులభం.

నవరాత్రి ఎనిమిదవ రోజు దుర్గాష్టమి. ఈ రోజు దుర్గాదేవి ఎనిమిదవ రూపమైన మహాగౌరి దేవిని పూజిస్తాము. పురాణాల ప్రకారం మహా గౌరికి కొబ్బరికాయ అంటే ఇష్టం. కనుక దుర్గా అష్టమి రోజున అమ్మవారికి కొబ్బరి పాయసాన్ని సమర్పించడం శుభప్రదం. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, తయారు చేయడం కూడా చాలా సులభం. రెసిపీ తెలుసుకుందాం.

నవరాత్రి 8వ రోజున మహాగౌరికి కొబ్బరి పాయసం సమర్పించండి.. రెసిపీ చాలా సులభం.
Coconut Kheer
Surya Kala
|

Updated on: Sep 30, 2025 | 10:21 AM

Share

నవరాత్రి పండుగలో ఎనిమిదవ రోజున దుర్గాష్టమిగా జరుపుకుంటున్నారు. నవరాత్రి ఎనిమిదవ రోజున మహాగౌరి దేవిని పూజిస్తారు. మహాగౌరిని పూజించడం వల్ల భక్తులు అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారని, జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. నవరాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరి దేవికి ప్రత్యేకంగా ఏదైనా సమర్పించాలని ఆలోచిస్తుంటే.. అమ్మవారికి ఇష్టమైన కొబ్బరి పాయసం ఉత్తమ ఎంపిక. మహాగౌరి అమ్మవారికి కొబ్బరి కాయ అంటే చాలా ఇష్టం. అందుకే అష్టమి రోజున కొబ్బరి ఖీర్ ను మహా గౌరికి నైవేద్యం పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు.. పాలు, కొబ్బరి సువాసన మీ ఇంటి మొత్తాన్ని నింపుతుంది. ఇది చాలా సులభమైన వంటకం. రెసిపీ తెలుసుకుందాం.

కొబ్బరి పాయసం తయారీకి కావలసిన పదార్థాలు

  1. ఫుల్ క్రీమ్ పాలు- 1 లీటరు
  2. కొబ్బరి -1 కప్పు తాజా తురిమిన కొబ్బరి
  3. బాస్మతి బియ్యం- 1/2 కప్పు (15-20 నిమిషాలు నానబెట్టినవి)
  4. చక్కెర లేదా బెల్లం 1/2 కప్పు (రుచికి సరిపడా)
  5. ఇవి కూడా చదవండి
  6. యాలకుల పొడి- 1/4 టీస్పూన్
  7. నెయ్యి -4 స్పూన్లు
  8. బాదం- 12
  9. పిస్తాపప్పు -12
  10. జీడిపప్పు –
  11. కిస్ మిస్ – కొంచెం
  12. కుంకుమపువ్వు- 5 రేకలు

కొబ్బరి పాయసం తయారీ విధానం:

  1. అడుగు మందంగా ఉన్న గిన్నె స్టవ్ మీద పెట్టి ముందు పాలు పోసి వేడి చేయండి. పాలు మరిగిన తర్వాత మంటను తగ్గించండి.
  2. మరిగిన పాలల్లో నానబెట్టిన బియ్యం వేసి.. తక్కువ మంట మీద బియ్యం ఉదికేవరకూ ఉడికించండి. బియ్యం అడుగున అంటుకోకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి.
  3. బియ్యం ఉడికి పాలు చిక్కగా అయిన తర్వాత తురిమిన కొబ్బరిని వేసి మరో 10 నిమిషాలు ఉడికించాలి.
  4. చివరిగా బెల్లం, లేదా చక్కర వేసి యాలకుల పొడి, కుంకుమపువ్వు రేకలు వేసి బాగా కలపండి. బెల్లం కరిగిపోయే వరకు ఉడికించి స్టవ్ మీద నుంచి దింపి..
  5. బాణలి స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి బాదం, జీడిపప్పు, కిస్ మిస్, జీడి పప్పు వేసి వేయించండి.
  6. ఇలా వేయించిన డ్రై ఫ్రూట్స్ ని రెడీ చేసుకున్న కొబ్బరి పాయసం లో వేసి బాగా కలపండి.
  7. అంతే రుచికరమైన కొబ్బరి ఖీర్ రెడీ. దానిని చల్లబరిచి మహాగౌరి దేవికి సమర్పించండి. తర్వాత కుటుంబంతో కలిసి ఈ కొబ్బరి పాయసాన్ని ఆస్వాదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే