- Telugu News Photo Gallery Apples On Empty Stomach: Health Benefits of Eating Red Apples Daily In The Morning
Apple: రోజూ ఖాళీ కడుపుతో ఓ యాపిల్ పండు తింటే.. నెలలోనే ఊహించని లాభాలు
Eating apples on an empty stomach: రోజుకొక్క యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదని వైద్యులు చెప్పడం మీరు అనేక సార్లు వినే ఉంటారు. కెలోరీలు, పీచు, సి-విటమిన్, కాపర్, పొటాషియంలతో యాపిల్ మంచి పోషకాహారం. మలబద్ధక సమస్యను నివారిస్తుంది..
Updated on: Sep 30, 2025 | 8:00 AM

యాపిల్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్, రక్తంలో చక్కెరలను నియంత్రిస్తుంది. సైనస్, ఉబ్బసం తదితర శ్వాస ఇబ్బందులను సైతం నివారిస్తుంది. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడటంలో యాపిల్ ఎంతో కీలకం.

ఇది రక్తపోటును క్రమబద్ధం చేస్తుంది. అగ్న్యాశయానికి (పాంక్రియాజ్) మంచిది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంట, తాపం, బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మంచి పోషకాలతో దండిగా ఉంటుంది. అందుకే త్వరగా ఆకలి వేయదు.

ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక ఆపిల్ తింటే నెల రోజుల్లోనే మీ ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే ఇందు కోసం ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక ఆపిల్ తినాలి. యాపిల్‌లో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది.

ఇందులోని ఫైబర్ మలబద్ధక సమస్యను నివారిస్తుంది. ఇది రక్తపోటును క్రమబద్ధం చేసి, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంట, తాపం, బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పోషకాలు దండిగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి యాపిల్ మంచి ఎంపిక.

బరువు తగ్గడానికి యాపిల్స్ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకుంటే వీటిని ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోవాలి. రోజూ యాపిల్ తింటే అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది.




