- Telugu News Photo Gallery Spiritual photos These Mistakes to avoid if you are wearing tulsi mala know Tulsi Mala wearing rules
Tulasi Mala: తులసి మాల ధరిస్తున్నారా.. ఈ విషయాలై దృష్టి పెట్టండి.. ఈ తప్పులు చేస్తే ముప్పే..
తులసి మాల హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీంతో చాలా మంది తులసి మాలను ధరించడానికి ఇష్టపడుతున్నారు. అనేక మత గ్రంథాలు తులసి మాలను ధరించడానికి నియమాలను నిర్దేశించాయి. వీటిని పాటించాలి. మీరు తులసి మాల ధరిస్తే కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి... లేకుంటే సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
Updated on: Oct 01, 2025 | 2:55 PM

తులసి మాల ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్లే.. అనేక నియమాలు కూడా ఉన్నాయి. దీనిని ధరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. జీవితంలో సానుకూలత వస్తుంది. శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు లభిస్తాయి. అనేక యజ్ఞాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. అయితే తులసి మాల ధరించే విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని విస్మరిస్తే తులసి మాలను ధరించడం వలన వైఫల్యం ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది.

తులసి మాల ధరించే ముందు.. దానిని శుద్ధి చేసుకోవాలి. ముందుగా గంగా జలంతో శుద్ధి చేయాలి. తులసి మాల ఆరిన తర్వాత మాత్రమే మీ మెడలో ధరించాలి. తులసి మాల ధరించేటప్పుడు శరీరం , బట్టలు శుభ్రంగా ఉండాలి.

తులసి మాల ధరించిన తర్వాత మాంసం, మద్యం, ఉల్లిపాయలు, వెల్లుల్లి , తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి. అంతే కాదు తులసి మాల ధరించే సమయంలో ధరించిన తర్వాత అబద్ధం, మోసం లేదా హింస వంటి చెడు పనులకు పాల్పడకూడదు. మాంసం లేదా మత్తు పదార్థాలు అలవాటు ఉన్నవారు తులసి మాలను ధరించకూడదు.

టాయిలెట్ లేదా శ్మశాన వాటికతో సహా ఏ అపవిత్ర ప్రదేశానికి తులసి మాల ధరించి వెళ్ళకూడదు. స్నానం చేసే సమయంలో లేదా టాయిలెట్ ఉపయోగించేటపుడు తులసి మాల ధరించకూడదు. ఈ ప్రదేశాలలోకి ప్రవేశించే ముందే తులసి మాలను శుభ్రమైన ప్రదేశంలో పెట్టాలి. మెడలో నుంచి తీసిన తులసి మాలను తర్వాత నేలపై ఉంచకూడదు.

నిద్రపోయేటప్పుడు తులసి దండ ధరించడం మతపరమైన, వ్యక్తిగత పవిత్రతకు సంబంధించిన విషయం. అయితే ఏదైనా అసౌకర్యం లేదా అశుద్ధతను నివారించడానికి.. వివాహితులు నిద్రపోయే ముందు తులసి దండను తీసి పవిత్ర స్థలంలో పెట్టుకోవాలి.

సనాతన ధర్మం ప్రకారం స్త్రీలు ఋతుస్రావం సమయంలో తులసి దండను ధరించడం లేదా తాకడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ కాలం శారీరకంగా అపవిత్రంగా పరిగణించబడుతుంది. కనుక తులసి మొక్క పవిత్రతను కాపాడటానికి తులసి మాలను తొలగించాలి.




