అక్టోబర్ నెల వీరికి అదృష్టం..వస్తూ వస్తూనే వీరికి లక్కు తెస్తోంది!
అక్టోబర్ నెల వచ్చేస్తోంది. అయితే ఈ నెల వస్తూ వస్తూనే మూడు రాశుల వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చడమే కాకుండా, అదృష్టాన్ని కూడా తీసుకొస్తుందంట. మరి ఈ నెలలో ఏ ఏ రాశుల వారికి లక్కు కలిసిరాబోతుందో ఇప్పుడు మనం చూద్దాం.
Updated on: Oct 02, 2025 | 10:44 AM

అక్టోబర్ నెలలో చాలా గ్రహాల సంచారం, కలయిక జరగనున్నాయి. అంతే కాకుండా, శని తిరోగమనం, కూడా జరగనున్నదంట. అయితే ఇది 12 రాశులపై తన ప్రభావాన్ని చూపినప్పటికీ, మూడు రాశుల వారికి మాత్రం అనుకోని విధంగా ప్రయోజనాలు చేకూరుస్తుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ సంవత్సరం అక్టోబర్ నెల చాలా విశేషమైనదంట. ఈ నెలల పండగలతో పాటు, గ్రహాల సంచారం కూడా ఎక్కువగానే జరగబోతుంది. ముఖ్యంగా శుక్ర గ్రహం, బుధ, కుజుడు తమ స్థానాలను మార్చుకుంటున్నారు. దీంతో అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి.

కుంభ రాశి : కుంభ రాశి ఉద్యోగులకు అక్టోబర్ నెల అద్భుతంగా ఉండబోతుంది. వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. ప్రతి పనిలో విజయం వీరి సొంతం అవుతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

మేష రాశి : మేష రాశి వారు ఈ నెల మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు. విద్యార్థలు విహార యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది, వీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అంతే కాకుండా అక్టోబర్ నెల ఈ రాశుల వ్యాపారస్తులకు లక్కు తీసుకొస్తుంది. వీరు ఏ పని చేసినా కలిసి రావడమే కాకుండా, పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో గ్రహాల సంచారం, మార్పు వలన వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.



