AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: జునాగఢ్‌లో ఇదో అద్భుతం.. యజ్ఞం చేస్తుండగా వచ్చిన మూడు సింహాలు.. ప్రశాంతంగా కూర్చున్న వైనం..

గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో విజయదశమి సందర్భంగా.. ఖోడియార్ మాతా ఆలయంలో యజ్ఞం జరుగుతున్నప్పుడు మూడు సింహాలు వచ్చి ఆలయ ప్రాంగణంలో కూర్చున్నాయి. ఆశ్చర్యకరంగా.. సింహాలు ఎవరికీ హాని చేయలేదు. యజ్ఞం పూర్తయిన తర్వాత.. అవి శాంతియుతంగా అడవిలోకి తిరిగి వెళ్ళిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

Viral Video: జునాగఢ్‌లో ఇదో అద్భుతం.. యజ్ఞం చేస్తుండగా వచ్చిన మూడు సింహాలు.. ప్రశాంతంగా కూర్చున్న వైనం..
Viral Video
Surya Kala
|

Updated on: Oct 05, 2025 | 12:54 PM

Share

భక్తిలో శక్తి ఉందేమో.. నమ్మకమే దైవ బలం.. గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో చోటు చేసుకున్న ఒక విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భక్తి .. అది తీసుకువచ్చే శాంతి .. అద్భుతమైన కలయిక కనిపించింది. విజయదశమి సందర్భంగా గిర్నార్‌లోని ఖోడియార్ మాతా ఆలయంలో ఒక యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో సమీపంలోని అడవి నుంచి మూడు సింహాలు వచ్చి కూర్చున్నాయి. యజ్ఞం చేస్తున్న బ్రాహ్మణులు భయం లేకుండా తమ యజ్ఞాన్ని కొనసాగించారు. సింహాలు అక్కడ ఉన్నవారికి ఎటువంటి హాని చేయలేదు. .. ఈ సమయంలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.

అత్యంత హింసాత్మక జీవులను కూడా శాంతింపజేసే శక్తి భక్తికి ఉంది. జునాగఢ్ లో చోటు చేసుకున్న ఈ దృశ్యం ద్వారా అది తెలుస్తుంది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది. గిర్నార్ పర్వతంపై ఖోడియార్ మాతాజీ కోసం విజయదశమి రోజున యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఇంతలో మూడు సింహాలు వచ్చి అక్కడ కూర్చున్నాయి. DCF నుంచి అందిన సమాచారం ప్రకారం.. దసరా రోజున యజ్ఞం జరుగుతుండగా మూడు సింహాలు అటుగా వెళ్తున్నాయి. మంత్రాల జపం విని.. అవి యజ్ఞ కుండం దగ్గరకు వచ్చి కూర్చున్నాయి.

ఇవి కూడా చదవండి

యజ్ఞం వద్దకు సింహాలు

యజ్ఞం కొనసాగుతున్నంత సమయం సింహాలు నిర్భయంగా ఉన్నాయి. యజ్ఞం చేస్తున్న బ్రాహ్మణులు భయం లేకుండా తమ పనిని కొనసాగించారు. యజ్ఞం పూర్తయిన వెంటనే.. సింహాలు లేచి నిలబడి అడవిలోకి వెళ్ళిపోయాయి. సింహాలు దైవిక శక్తి అయిన అమ్మవారిని పూజించడానికి ఆలయానికి చేరుకున్నట్లు అనిపించింది. ఒక వ్యక్తి ఈ సంఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఇప్పుడు వేగంగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియో చూసి ప్రజలు రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

వీడియో వైరల్

కొంతమంది వైరల్ వీడియోను భక్తి మరియు శక్తి యొక్క ప్రత్యేక కలయిక అని పిలుస్తుండగా.. మరికొందరు తల్లి ఖోడియార్ ఆశీర్వాదంతో సింహాలు కూడా శాంతింగా ఉన్నాయని అంటున్నారు. అయితే, చాలా మంది వన్యప్రాణుల సంరక్షణ నియమాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!