ఏ కంపెనీ సిలిండరైనా రెడ్ కలర్‌లోనే ఎందుకు ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కారణం ఇదే..
ఈ కాలంలో LPG గ్యాస్ సిలిండర్ల వినియోగం పెరిగింది. అయితే అవి ఎరుపు రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా? LPG అత్యంత మండే స్వభావం కలది. ఎరుపు రంగు దూరం నుండి సులభంగా కనిపిస్తుంది, ప్రమాదానికి సూచన. వినియోగదారుల భద్రత కోసం, అగ్నిప్రమాదాల్లో త్వరగా గుర్తించడానికి ఈ రంగును ఉపయోగిస్తారు.

ఈ కాలంలో దాదాపు ప్రతీ ఇంట్లో కూడా వంట కోసం గ్యాస్ వాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం గ్యాస్ వినియోగం పెంచేందుకు పలు రకాల పథకాలు కూడా ప్రవేశపెట్టాయి. దీంతో LPG సిలిండర్ల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే ఎప్పుడైనా గమనించారా? ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ రెడ్ కలర్‌లోనే ఎందుకు ఉంటుంది. వాటికి వేరే రంగులు ఎందుకు వేయరో అని డౌట్ వచ్చిందా? అసలు వాటికి రెడ్ కలర్ మాత్రమే ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కనిపించే వర్ణపటంలో ఎరుపు రంగు కాంతి అత్యధిక తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుంది. కాబట్టి ఇది చాలా దూరం నుండి కూడా కనిపిస్తుంది. ప్రమాదకరమైన లేదా అత్యవసరమైన దేనికైనా ఎరుపు రంగును ఉపయోగిస్తారు. LPG ఎక్కువగా మండే గుణం కలిగి ఉంటుందని మనకు తెలుసు కాబట్టి వినియోగదారుల భద్రత కోసం దీనిని ఎరుపు రంగులో పెయింట్ చేస్తారు. ఎప్పుడైనా అగ్నిప్రమాదాలు లాంటివి సంభవించినా.. వీటిని అక్కడ నుంచి వేగంగా గుర్తించి తరలించేందుకు వీలుగా ఉంటుంది. అలాగే రైళ్లో బస్సుల్లో వీటిని తరలించకుండా ఉండేందుకు వాటిని గుర్తుపట్టేందుకు కూడా రెడ్ కలర్ వాడుతారు. అయితే కమర్షియల్ సిలిండర్లకు మాత్రం బ్లూ కలర్ ఉంటుంది. డొమెస్టిక్ సిలిండర్లకు, వాటికి తేడా కోసం వాటికి బ్లూ కలర్ వాడుతారు. సింగపూర్‌లో అన్ని సిలిండర్లకు నీలం రంగు ఉపయోగిస్తారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
