Clothes Donation: మీ పాత దుస్తులు దానం చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి!
దానం చేయడం అనేది మంచి పని. ఎంత లేకపోయినా.. ఉన్నదాంట్లో దానం చేయమని చెబుతూ ఉంటారు. కొంత మంది తమకు తోచిన దానం చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా చాలా మంచి పాత బట్టలను దానం చేస్తూ ఉంటారు. అయితే పాత బట్టలను దానం చేసేటప్పుడు కొన్ని విషయాలను ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.
వయసు పెరిగే కొద్దీ ధరించే బట్టల సైజ్ కూడా మారుతూ ఉంటాయి. అలాగే బాగున్నాయని బట్టలను కూడా ఎక్కువగా కొంటూ ఉంటారు. వాటిని ఎక్కువగా ఉపయోగించరు కూడా. కొద్ది రోజులకు పాతవైపోయాయని కొంత పడేస్తారు. ఇంకొంత మంది లేని వాళ్లకు దానం చేస్తూ ఉంటారు. మరికొందరు తెలిసిన వాళ్లకు, పక్కింటి వాళ్లకు ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడే ఒక విషయం గమనించారు. లేని వాళ్లకు ఇవ్వడం వల్ల బట్టలు ఎంతో బాగున్నాయని ఎంతో సంతోషిస్తారు. అయితే ఇక్కడే ఒక విషయం గమనించాలి. ఎలాంటి బట్టలు దానం చేయాలి? ఎవరికి ఎలాంటివి ఇవ్వకూడదు అనే విషయాలు తెలుసుకోవాలి.
శక్తిని ప్రసరింపజేస్తుంది..
వాస్తు శాస్త్రం ప్రకారం.. బట్టలకు శక్తిని గ్రహించే తత్త్వం కూడా ఉంది. అప్పటి వరకూ దుస్తులు ధరించిన వ్యక్తి.. శక్తి, భావోద్వేగాలు, అనుభవాలు.. దానం చేసిన వారికి కూడా చూపుతుంది. మీ బట్టలు దానం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రకాల దుస్తులు ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. దుస్తులకు కూడా కొన్ని రకాల వాస్తు నియమాలు ఉన్నాయి.
ఇలా శుభ్రం చేసి ఇవ్వండి..
మీరు దుస్తులు దానం చేసేటప్పుడు చిరిగిపోయినవి, పనికి రానివి కాకుండా కాస్త మంచిగా ఉన్నవి మాత్రమే దానం చేయాలి. మీరు దానం చేసేటప్పుడు ఉప్పు నీటిలో ముంచి ఆరేసి ఇవ్వాలి. అలాగే మీరు దానం చేసిన తర్వాత ఎదుటి వ్యక్తిని కనీసం రూపాయి అయినా అడిగి తీసుకోవాలి. అలాగే గురువారం పూట బట్టలు దానం చేస్తే మంచిది.
ఇలా చేస్తే కుజ దోషం పోతుంది..
ఎదుటి వారికి సహాయం చేయాలి అనుకున్నప్పుడు మీరు పాత దుస్తులు కాకుండా కొత్త దుస్తులు కొన్ని ఇచ్చేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా చలి కాలంలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ క్రమంలో స్వెటర్లు, దుప్పట్లు, రగ్గులు వంటివి కొని ఇవ్వడం వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం జాతకంలో కుజదోషం పోతుందని పండితులు చెబుతారు. అంతే కాకుండా లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుందట.