Ice Cream Biryani: ఐస్‌క్రీమ్ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే.! కాంబినేషన్ ఏంటని ప్రశ్నలు..
ఐస్‌క్రీమ్ బిర్యానీ.. మీరు సరిగ్గానే విన్నారు. ఐస్ క్రీమ్ బిర్యానీనే. ఐస్‌క్రీమ్ చాలా కూల్, టేస్టీగా ఉండే ఒక ఫుడ్ ఐటమ్.ఇక బిర్యానీ హాట్ హాట్ గా ఘుమఘుమలాడే మసాలా సుగంధంతో ఉండే వంటకం! ఈ రెండూ వేర్వేరు రుచుల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. కానీ, ఈ రెండింటినీ కలిపితే ఎలా ఉంటుంది? ఇలాంటి వింత ఆలోచన ఓ మహిళకు వచ్చింది.అంతే “ఐస్‌క్రీమ్ బిర్యానీ” అనే కొత్త ఐటమ్ ని తయారుచేసింది.
వినడానికి విడ్డూరంగా ఉంది కదా? ముంబైకి చెందిన ఫుడ్ క్రియేటర్ హీనా కౌసర్ రాద్ చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఈ కాంబినేషన్ చూసిన నెటిజన్లు షాక్ అవ్వడంతో పాటు, వింత కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. హీనా ఒక బేకింగ్ అకాడమీని కూడా నడుపుతున్నారు. తన అకాడమీలో ఏడు రోజుల బేకింగ్ కోర్సు ముగిసిన సందర్భంగా ఓ ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడే ఈ వింత వంటకాన్ని పరిచయం చేశారు.ఆ పార్టీలో ఉన్నవాళ్లతో పాటు, ఆ వీడియో చూసిన నెటిజన్లు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు బిర్యానీలో ఐస్‌క్రీమ్ ఏంటి అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వీడియోలో హీనా రెండు పెద్ద బిర్యానీ హండీల పక్కన నిలబడి ఉన్నారు . పింక్ స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్ స్కూప్స్తో ఆ కుండలను అలంకరించారు. గరిటెతో బిర్యానీని తీస్తుంటే, బంగారు వర్ణంలో మెరిసే మసాలా బిర్యానీ, దానికి పూర్తి కాంట్రాస్ట్‌గా ఉండే పింక్ ఐస్‌క్రీమ్ ఒకదానికొకటి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈ విజువల్ ఎఫెక్ట్ చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.