చాలా మంది పడుకునేటప్పుడు దిండు పెట్టుకుంటూ ఉంటారు. దిండు లేకపోతే కొందరికి అస్సలు నిద్రపట్టదు. కొంతమందికి దిండు ఎత్తుగా ఉంటే అంత హాయిగా నిద్రపోతూ ఉంటారు.
కానీ చాలా మందికి ఒక డౌట్ వచ్చింది ఉంటుంది? తలగడ పెట్టుకుంటే మంచిదా లేక దిండు వేసుకోకుంటే మంచిదా? ఇప్పుడు ఈ విషయం గురించి తెలుసుకుందాం..
ఒకవేళ మీరు దిండు వాడితే తల తటస్థ స్థితిలో ఉండాలి. ఈ దిండు ఎవరైనా వాడాలని అనుకుంటే ఒకవైపు పడుకునేవారు మాత్రమే వాడాలి..
మీకు గనుక బోర్లా పడుకునే అలవాటు ఉంటే తలగడ పెట్టుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీరు కచ్చితంగా పెట్టుకోవాలంటే మాత్రం చిన్న పలుచగా ఉండే దిండును పెట్టుకోవడం మంచిది
మీకు ఒకవైపు పడుకోకుండా బ్రోర్లా పడుకునే అలవాటు ఉంటే తలగడ వాడకండి. దీని వల్ల వెన్ను నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది.
దిండు లేకుండా నిద్రపోతే వెన్నుముక నిటారుగా ఉంటుందని నిపుణలు చెబుతున్నారు.
దిండు లేకుండా నిద్రపోతే బాడీ పోస్చర్ మంచిగా ఉంటుంది. నిద్రలేమి వంటి సమస్యలు దూరమవుతున్నాయి. నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది.
మీరు నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి దిండు లేకుంటే పడుకోవడానికి ప్రయత్నించండి