Keerthy Suresh: ముంబైలో ఫోటోగ్రాఫర్లతో గొడవ.. కీర్తి సురేష్ రియాక్షన్ ఇదే..
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే బేబీ జాన్ సినిమాతో నార్త్ అడియన్స్ ను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. అటు కమర్షియల్ గా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ నటించిన లేటేస్ట్ మూవీ బేబీ జాన్. ఈ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది కీర్తి సురేష్. డైరెక్టర్ అట్లీ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ ప్రాజెక్ట్ అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ చిత్రం 25 డిసెంబర్ 2024న విడుదలైంది. వసూళ్లు పడిపోవడంతో బేబీ జాన్ ఫ్లాప్ దిశగా పయనిస్తోంది. ఇటీవల బేబీ జాన్ ప్రీమియర్ సమయంలో కీర్తి టీం, ఫోటోగ్రాఫర్స్ మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోస్ సైతం నెట్టింట వైరలయ్యాయి. తాజాగా ఆ వివాదం పై రియాక్ట్ అయ్యింది కీర్తిసురేష్.
కీర్తి సురేష్ ఇటీవల ముంబైలో సినిమా ప్రీమియర్‌కు హాజరైన తర్వాత తన కారులో కూర్చుంది. ఆ సమయంలో ఆమె డీమ్ నెక్ డ్రెస్ ధరించింది. దీంతో ఆమెకు కారులో కూర్చుంటున్న సమయంలో ఓ వ్యక్తి కీర్తిని ఫోటో తీయడంపై ఆమె టీం సభ్యులు మండిపడ్డారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియై నెట్టింట వైరలయ్యింది.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోపై కీర్తి సురేష్ స్వయంగా స్పందించింది. గలాట్టా ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రోజు ఏమి జరిగినా తాను చాలా గందరగోళానికి గురయ్యానని కీర్తి చెప్పింది. ‘ఆ గొడవ జరుగుతున్నప్పుడు నాకేం అఏర్థం కాలేదు. నేను చాలా గందరగోళంగా ఉన్నాను. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. మీరు నన్ను వీడియోలో చూస్తుంటే మీకు తెలిసిపోతుంది. ఆ తర్వాత నా టీం వ్యక్తి లోపలికి వచ్చాక చెబితే తెలిసింది” అంటూ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.