AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Game Changer: అఫీషియల్.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్‌కు పండగే

మెగాభిమానులకు సంక్రాంతి ముందే రానుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారు. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది.

Game Changer: అఫీషియల్.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్‌కు పండగే
Pawan Kalyan, Ram Charan
Basha Shek
|

Updated on: Jan 02, 2025 | 10:55 PM

Share

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది . ఈ చిత్రం జనవరి 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానుల అంచనాలను రెట్టింపు చేసేలా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ట్రైలర్ గురువారం (జనవరి 2) విడుదలైంది. SS రాజమౌళి ట్రైలర్‌ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపారు. మెగా అభిమానులకు ఈ ట్రైలర్ బాగా నచ్చింది. సినిమా విడుదల కోసం వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మెగాభిమానులకు మరింత జోష్ ఇచ్చేలా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌పై చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. జనవరి 4వ తేదీన రాజమండ్రి వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఫంక్షన్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో మెగాభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. బాబాయి, అబ్బాయిలను ఒకే వేదికపై చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నామంటున్నారు మెగా ఫ్యాన్స్

ఇవి కూడా చదవండి

కాగా ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించింది. పొలిటికల్ థ్రిల్లర్‌తో పాటు ఫ్యామిలీకి నచ్చే సెంటిమెంట్ కథాంశంతో ఈ సినిమా ఉంటుందనే ట్రైలర్‌ ద్వారా నిరూపితమైంది.  ఓవరాల్‌గా ఈ సినిమా మెగాభిమానులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అంజలి, ఎస్.జె. సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రా మచ్చా, నానా హైరానా, జరగండి, ధోప్ పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచాయి. ఇక కొన్ని గంటల క్రితమే రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా నెక్ట్స్ లెవెల్ ఉందంటున్నారు మెగా ఫ్యాన్స్.

రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

క్రిస్మస్‌ రోజున విరుచుకుపడిన మెరుపు వరదలు
క్రిస్మస్‌ రోజున విరుచుకుపడిన మెరుపు వరదలు
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..