Sreeleela: తగ్గేదేలే.. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కిస్సిక్ భామ.. ఆ స్టార్ హీరో సరసన శ్రీలీల..

ఇటీవలే కిస్సిక్ అంటూ స్టెప్పులతో యూత్ ను ఊర్రూతలుగించింది శ్రీలీల. దీంతో అటు నార్త్ ఇండస్ట్రీలోనూ ఈ అమ్మడు పేరు మారుమోగుతుంది. అలాగే ఇప్పుడిప్పుడు శ్రీలీలకు హిందీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టినట్లు సమచారం. తాజాగా ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..?

Sreeleela: తగ్గేదేలే.. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కిస్సిక్ భామ.. ఆ స్టార్ హీరో సరసన శ్రీలీల..
Sreeleela
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 02, 2025 | 9:58 PM

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ సినిమాలో కిస్సిక్ అంటూ స్పెషల్ సాంగ్ అదరగొట్టేసింది హీరోయిన్ శ్రీలీల. దీంతో అటు నార్త్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు పేరు ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతుంది. అలాగే శ్రీలీల బాలీవుడ్ అరంగేట్రం చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తన రాబోయే సినిమా ‘తు మేరీ మైన్ తేరా, మేన్ తేరా తు మేరీ’తో శ్రీలీలకి పెద్ద బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఇండియా టుడే నివేదిక ప్రకారం, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై రాబోయే చిత్రంలో శ్రీలీల నటించనుందని టాక్. ఈ మూవీతోనే ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయనుందని అంటున్నారు.

ఇందులో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించనున్నాడని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఇప్పుడు శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ పేర్లు తెగ వైరలవుతున్నాయి. ధర్మ ప్రొడక్షన్స్‌తో శ్రీలీల చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఆమె ఫైనల్ అయితే అది ఆమె బాలీవుడ్ అరంగేట్రం అవుతుంది . బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ సరసన శ్రీలీల స్టెప్పులేయనుందని టాక్. శ్రీలీల 2019లో ‘కిస్’ అనే కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

అలాగే తెలుగులో ‘గుంటూరు కారం’, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’, ‘భగవంత్‌ కేసరి’, ‘స్కంద’, ‘ధమాకా’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇటీవలే పుష్ప 2 చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది.

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.