- Telugu News Photo Gallery Cinema photos Singer Geetha Madhuri Son Annaprasana Ceremony Photos Go Viral
Geeta Madhuri: ఘనంగా గీతా మాధురి కుమారుడి అన్నప్రాసన వేడుక.. పిల్లాడికి ఏం పేరు పెట్టారో తెలుసా? ఫొటోస్
టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురి, నటుడు యాంకర్ నందులకు ఈ ఏడాది ప్రారంభంలో కుమారుడు జన్మించాడు. తాజాగా తమ బిడ్డకు అన్న ప్రాసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గీతా మాధురి దంపతులు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
Updated on: Jan 02, 2025 | 9:57 PM

టాలీవుడ్ లవ్లీ కపుల్ నందు- సింగర్ గీతామాధురి ఈ ఏడాది ప్రారంభంలో మరోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఫిబ్రవరి 10న గీతా మాధురి ఓ పండంటి మగ బిడ్డను ప్రసవించింది

ఈ దంపతలకు ఇదివరకే దాక్షాయణి అనే కూతురు ఉంది. ఇక తమ కుమారుడికి ధృవధీర్ తారక్ అని నామకరణం చేశారు.

ఇటీవల ఈ బుడ్డోడికి అన్నప్రాసన వేడుక నిర్వహించారు గీతా మాధురి- నందు దంపతులు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ స్పెషల్ ఈవెంట్ కు సంబంధించిన పిక్స్ ను గీతా మాధురి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా అవి వైరలవుతున్నాయి.

ఈ ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా గీతా మాధురి-నందుల పిల్లలు ఎంతో క్యూట్ గా ఉన్నారు.

2014లో గీతా మాధురి- నందుల వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. 2019లో ఈ సెలబ్రిటీ కపుల్ కు ఒక ఆడబిడ్డ జన్మించింది.





























