- Telugu News Photo Gallery Cinema photos Ram Charan Game changer Movie Team Ready to grand welcome to new year 2025 first pan india movie
Ram Charan-Game Changer: కొత్త సంవత్సరంలో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ రామ్ చరణ్ దే.!
గేమ్ చేంజర్ సినిమా విషయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట కూడా భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావటంతో గేమ్ చేంజర్‌లో తమిళ ఆడియన్స్ కూడా ఓన్ చేసుకుంటున్నారు.అయితే నిన్న మొన్నటి వరకు కోలీవుడ్‌లో భారీ వసూళ్ల విషయంలో కాస్త అనుమానాలు కనిపించినా.. లేటెస్ట్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్ కం చెప్పేందుకు రెడీ అవుతోంది గేమ్ చేంజర్ మూవీ.
Updated on: Jan 02, 2025 | 9:45 PM

గేమ్ చేంజర్ సినిమా విషయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట కూడా భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావటంతో గేమ్ చేంజర్‌లో తమిళ ఆడియన్స్ కూడా ఓన్ చేసుకుంటున్నారు.

అయితే నిన్న మొన్నటి వరకు కోలీవుడ్‌లో భారీ వసూళ్ల విషయంలో కాస్త అనుమానాలు కనిపించినా.. లేటెస్ట్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్ కం చెప్పేందుకు రెడీ అవుతోంది గేమ్ చేంజర్ మూవీ. మోస్ట్ అవెయిటెడ్ లిస్ట్‌లో ఉన్న ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన యూనిట్ అన్ని రాష్ట్రాల మీద స్పెషల్ కేర్ తీసుకుంటోంది. ముఖ్యంగా చరణ్ హోం స్టేట్స్ ఆంధ్రా, తెలంగాణతో పాటు శంకర్ కోసం తమిళనాడులోనూ భారీ ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తోంది. అయితే తెలుగు స్టేట్స్‌లో గేమ్ చేంజర్‌కు పెద్దగా పోటి కనిపించకపోయినా..

తమిళనాట మాత్రం నిన్న మొన్నటి వరకు గట్టి పోటి తప్పదన్న టాక్ వినిపించింది. నెమ్మది గా అక్కడ కూడా గేమ్ చేంజర్‌కి గ్రౌండ్ క్లియర్ అవుతోంది. విక్రమ్ - వీర ధీర సూరన్, బాలా - వనంగాన్, అజిత్ - విడాముయర్చి సినిమాలు జనవరి 10న రిలీజ్ కు ప్లాన్ చేసుకున్నాయి.

కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్‌లో ఈ సినిమాలన్నీ ఆడియన్స్ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవటంతో వీర ధీర సూరన్‌ను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు.

దీంతో మేజర్ మూవీ కాంపిటీషన్ నుంచి తప్పుకున్నట్టైంది. న్యూ ఇయర్ రోజు అజిత్ విడాముయర్చి కూడా పొంగల్ బరి నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది చిత్రయూనిట్. అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నామని, కొత్త డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.

దీంతో గేమ్ చేంజర్‌కు కోలీవుడ్ మార్కెట్‌లో పోటి లేకుండా పోయింది. ప్రజెంట్ తమిళ మార్కెట్‌లో పొంగల్ బరిలో ఉన్న ఒకే ఒక్క సినిమా వనాంగన్. అరుణ్ విజయ్ హీరోగా బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద మంచి బజ్ ఉన్నా..

మార్కెట్ పరంగా శంకర్ సినిమాతో పోటి పడే అవకాశం లేదు. అందుకే కోలీవుడ్ మార్కెట్‌లోనూ గేమ్ చేంజర్ సోలోగా బరిలో దిగుతున్నట్టే అంటున్నారు సినీ జనాలు. మరి ఈ అడ్వాంటేజ్ కలెక్షన్ల విషయంలో ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.




