- Telugu News Photo Gallery Cinema photos Did You Know This Actress Charged rs 5 Crores For 3 Minutes Special Song, She Is Samantha
Tollywood : ఒకప్పుడు ఆర్థిక సమస్యలతో చదువుకు దూరం.. ఇప్పుడు 3 నిమిషాల పాటకు 5 కోట్లు.. ఎవరంటే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్. కానీ ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం పూర్తిగా విభిన్నం. ఎన్నో కష్టాలను ఎదుర్కొని సినీరంగంలో స్టార్ స్టేటస్ అందుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Updated on: Jan 02, 2025 | 9:31 PM

సినీరంగంలో అందం, అభినయంతో కట్టిపడేసిన హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగు, తమిళం, హిందీలో పలు చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆమె నటనకు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.

కానీ కొన్నాళ్లుగా వ్యక్తిగత సమస్యలతో సినిమాలకు దూరంగా ఉంటుంది. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమంత. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సామ్.. వరుస ఆఫర్స్ అందుకుంటుంది.

ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సామ్.. ఒకప్పుడు మాత్రం ఆర్థిక సమస్యలతో చదువుకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టిందన్న సంగతి తెలుసా.. ?

డివోర్స్, మయోసైటిస్ సమస్యలతో సినిమాలకు దూరమైన సామ్.. ఇప్పుడిప్పుడే తిరిగి రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సిరీస్ కోసం సామ్ ఏకంగా రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. అంతకు ముందు పుష్ప 1 మూవీలో స్పెషల్ సాంగ్ చేసినందుకు రూ.5 కోట్లు రెమ్యునరేషన్ అందుకుందని టాక్.




