- Telugu News Photo Gallery Cinema photos Can you guess who is the heroine in this photo, She is a crazy heroine Malavika Mohanan
పెద్ద ప్లానే.. టాలీవుడ్‌లో జెండా పాతడానికి రెడీ అవుతున్న అందాల భామ
సినిమా ఓ రంగుల ప్రపంచం. ఈ సినీ పరిశ్రమలో నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని కోటి కలలో అడుగుపెడుతుంటారు. ముఖ్యంగా కొత్త హీరోయిన్స్ చాలా మంది వస్తుంటారు. ఒకటి రెండు చిత్రాలతో చాలా ఫేమస్ అయిపోతుంటారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు.
Updated on: Jan 03, 2025 | 1:53 PM

చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది భామలు టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు కూడా. అలాగే ఈ అమ్మడు కూడా ఇప్పుడు తెలుగులో పాతుకుపోవాలని చూస్తుంది.

ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీ మాళవిక మోహన్. తమిళ్ లో తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో అడుగు పెడుతుంది. అంతకు ముందు, రజినీకాంత్ పేట, దళపతి విజయ్ మాస్టర్, విక్రమ్ తంగలాన్ సినిమాతో ఆకట్టుకుంది.

ఇంతకూ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో సినిమాలు చేయకపోయినా.. ఇక్కడ మంచి క్రేజ్ తెచ్చుకుంది. తమిళ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. రజినీకాంత్, విక్రమ్, దళపతి విజయ్ సినిమాల్లో చేసింది ఈ బ్యూటీ.

అందుకే ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు ఏకంగా ఓ బడా హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ హీరో రేంజ్ అంతా ఇంతా కాదు మరి. తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు. అందంలోనూ ఆ అమ్మడు అప్సరసే.

ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో డైరెక్ట్ గా తెలుగులోకి అడుగుపెడుతుంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ఈ చిన్నది వరుస ఆఫర్స్ అందుకుంటుందేమో చూడాలి.




