Rohith Sharma: రోహిత్ రిటైర్మెంట్‌పై మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు.. ఇదే సరైన సమయం అంటూ..
ఇటివలే ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా చెత్త ప్రదర్శన చేసింది. ముఖ్యంగా స్టార్ ప్లేయర్ ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా రోహిత్ ప్రదర్శన చాలా వరస్ట్‌గా ఉంది. దీంతో రోహిత్ ఈ సీరిస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. రోహిత్ రిటైర్మెంట్‌పై మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆస్ట్రేలియా టూర్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియా జట్టులో అసమ్మతి చెలరేగడంపైయ చర్చ నడుస్తుంది. దీంతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శనపై కూడా పెద్ద డిబేటే నడుస్తుంది. ఆస్ట్రేలియా పర్యటనలో తన టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తుంది. దీనికి తోడు ఇప్పుడు చివరి టెస్టు మ్యాచ్ నుంచి రోహిత్‌ను తప్పించారు. కెప్టెన్ రోహిత్ వీడ్కోలు మ్యాచ్ ఆడకుండానే టెస్టు ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతాడన్న సంకేతాలన్నీ కనిపిస్తున్నాయి. కాగా, రోహిత్ శర్మ టెస్టు కెరీర్ గురించి మాట్లాడిన టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి.. రోహిత్ టెస్టుల నుంచి రిటైరైనా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నాడు.
టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్ అవుతాడనే ఊహాగానాల మధ్య, భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు, ‘నేను ఇప్పుడు రోహిత్ శర్మతో కాంటాక్ట్‌లో ఉంటే, అతని పాత ఆటను యథావిధిగా ఆడమని చెప్పాను. ప్రస్తుతం అతను సరిగ్గా ఆడటం లేదు. ప్రత్యర్థి బౌలర్‌పై రోహిత్ దూకుడుగా ఆడాలి. అయితే ఫామ్ లేమితో బాధపడుతున్న రోహిత్ కెరీర్‌పై ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. ఈ దశలో రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు” అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
2024లో 40 సగటుతో శుభ్‌మన్ గిల్ లాంటి యువ ఆటగాళ్లు చాలా మంది క్యూలో ఉన్నారని ఆయన అన్నారు. ఇలాంటి ఆటగాళ్లు బెంచ్‌పై కూర్చోవడం ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి రోహిత్ రిటైర్మెంట్ తీసుకున్నా నేను ఆశ్చర్యపోనవసరం లేదు, కానీ అది పూర్తిగా రోహిత్ నిర్ణయమే అవుతుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ అర్హత సాధిస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అయితే రోహిత్ తన కెరీర్‌ను ముగించేందుకు ఇదే సరైన సమయమని రవిశాస్త్రి అన్నాడు. గత మూడు సిరీస్‌లలో రోహిత్ 15 ఇన్నింగ్స్‌ల్లో 10.93 సగటుతో 164 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మూడు సిరీస్‌లలో రెండు సిరీస్‌లు భారత్‌లో జరిగాయి. అయితే ఈ రెండు సిరీస్‌లలో రోహిత్ ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. కాకపోతే ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ 31 పరుగులు మాత్రమే చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి