Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs AUS: సిడ్నీలో ఆ ముగ్గురు ఆసీస్ ప్లేయర్లు చాలా డేంజర్.. త్వరగా ఔట్ చేయకుంటే అస్సామే..

శుక్రవారం నుంచి భారత్ ఆసీస్ మధ్య 5వ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే సిడ్నీ టెస్టులో ముగ్గురు ఆసీస్ ప్లేయర్లకు మంచి రికార్డు ఉంది. ఖవాజా, లబుషేన్, స్మిత్‌లకు సిడ్నీలో మంచి రికార్డు స్కోర్ ఉంది. టీమిండియాపై 4 ఇన్నింగ్స్‌లో 400 పరుగులు రన్స్ చేయగా, 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు చేశాడు. లుబుషేన్ 10 ఇన్నింగ్స్‌లో 734 పరుగులు చేయగా, ఖావాజా12 ఇన్నింగ్స్‌లో 832 పరుగులు చేశారు. టీమిండియా ఈ ముగ్గురు ప్లేయర్ల నుంచి మోపు పొంచి ఉంది.

IND Vs AUS: సిడ్నీలో ఆ ముగ్గురు ఆసీస్ ప్లేయర్లు చాలా డేంజర్.. త్వరగా ఔట్ చేయకుంటే అస్సామే..
Dangerous Australia Player
Velpula Bharath Rao
|

Updated on: Jan 02, 2025 | 9:22 PM

Share

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ జనవరి 3 శుక్రవారం సిడ్నీలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం భారత్ సిరీస్‌లో 1-2తో వెనుకబడి ఉంది. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా భారత్ గెలవాలి. కాబట్టి సిరీస్‌ను కొత్త సంవత్సరంలో విజయంతో ముగించాలని టీమిండియా భావిస్తుంది.  ఐదో టెస్టుకు రోహిత్ శర్మ దూరం కానున్నాడని, అతని స్థానంలో శుభమన్ గిల్ ఆడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రసిద్ద్ కృష్ణ‌కు అవకాశం లభించనున్నట్లు తెలుస్తుంది.

సిడ్నీ టెస్ట్ కోసం భారత జట్టు తన ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 ప్రధాన మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ఫామ్‌లో లేని రోహిత్ శర్మ మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే రోహిత్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్, టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లకు సమాచారం అందించగా వారు కూడా అంగీకరించినట్లు సమాచారం. ఒకవేళ రోహిత్ చివరి టెస్టు ఆడకపోతే, అతని స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను ఛాన్స్ దొరకవచ్చు. KL రాహుల్ 3వ నంబర్‌లో ఆడుతున్నందున మళ్లీ ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ వస్తాడు. ప్లేయింగ్ ఎలెవెన్‌లో మూడో ప్రధాన మార్పు చేయవచ్చు. మెల్ బోర్న్ టెస్టులో ఆడిన ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఐతే ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌లో అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గతంలో దక్షిణాఫ్రికాలో 2 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అతను ఆస్ట్రేలియాలో ఆడడం ఇదే తొలిసారి.

అయితే సిడ్నీ టెస్టులో ముగ్గురు ఆసీస్ ప్లేయర్లకు మంచి రికార్డు ఉంది. ఖవాజా, లబుషేన్, స్మిత్‌లకు సిడ్నీలో మంచి రికార్డు స్కోర్ ఉంది. టీమిండియాపై 4 ఇన్నింగ్స్‌లో 400 పరుగులు రన్స్ చేయగా, 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు చేశాడు. లుబుషేన్ 10 ఇన్నింగ్స్‌లో 734 పరుగులు చేయగా, ఖావాజా12 ఇన్నింగ్స్‌లో 832 పరుగులు చేశారు. టీమిండియా ఈ ముగ్గురు ప్లేయర్ల నుంచి మోపు పొంచి ఉంది.

భారత ప్రాబబుల్ స్క్వాడ్: కేఎల్ రాహుల్, యస్సవి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, పర్షిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా జట్టు: సామ్ కాన్స్టాన్స్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషానే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), నాథన్ లియాన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి