Vinod Kambli: ‘ఈ జోష్ ఎల్లకాలం ఇలాగే ఉండాలి’.. పుష్ప స్టైల్‌లో క్రికెట్ ఆడిన వినోద్ కాంబ్లీ.. వీడియో

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న సమయంలో కాంబ్లీ లో నూతనోత్సాహం కనిపించింది. పుష్ప స్టైల్ లో బ్యాట్ పట్టి సందడి చేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Vinod Kambli: 'ఈ జోష్ ఎల్లకాలం ఇలాగే ఉండాలి'.. పుష్ప స్టైల్‌లో క్రికెట్ ఆడిన వినోద్ కాంబ్లీ.. వీడియో
Vinod Kambli
Follow us
Basha Shek

|

Updated on: Jan 02, 2025 | 7:59 PM

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం క్షీణించడంతో కొన్నిరోజుల క్రితమే ఆస్పత్రిలో చేరాడు. థానే ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. వైద్య పరీక్షల్లో కాంబ్లీకి మూత్రపిండాల సమస్యలు, మెదడులో రక్తం గడ్డకట్టిందని తేలింది. అయితే చికిత్స తీసుకోవడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడీ మాజీ క్రికెటర్. వినోద్ కాంబ్లీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా చాలా వీడియోలు, ఫోటోలు బహిర్గతమయ్యాయి. వీటిని చూసి క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరం తొలిరోజు వినోద్ కాంబ్లీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సుమారు పది రోజుల చికిత్స తర్వాత, అతను భివాండిలోని అక్రిత్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేస్తూ, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంబ్లీ వ్యసనాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించాడు.

ఇక డిశ్చార్జ్ సమయంలో వినోద్ కాంబ్లీ చాలా ఉత్సాహంగా కనిపించాడు. టీమ్ ఇండియా జెర్సీ, తలపై టోపీ, కళ్లకు గాగుల్స్‌తో గతంలో కంటే భిన్నంగా దర్శనమిచ్చాడు. అంతేకాదు బ్యాట్ తీసుకుని పుష్ప స్టైల్‌తో ‘ తగ్గేదేలే’ అంటూ ఆసుపత్రిలో క్రికెట్ కూడా ఆడాడు. ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లే సమయంలో వైద్యులు, సిబ్బంది, ఆస్పత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు కాంబ్లీ. కాగా త్వరలోనే ఈ టీమిండియా మాజీ క్రికెటర్ మైదానంలోకి రానున్నాడని, శివాజీ పార్క్ మైదానంలో సిక్సర్లు, ఫోర్లు బాదేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. మరోసారి సచిన్ టెండూల్కర్‌తో కలిసి ప్రాక్టీస్‌ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

కాంబ్లీ ఆరోగ్యం క్షీణించిందని కలవరపడిన అభిమానులు ఇప్పుడు అతనిని చూసి హ్యాఫీగా ఫీలవుతున్నారు. వీలైనంత త్వరగా కాంబ్లీ కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆసుపత్రి నుంచి బయటకు వచ్చే సమయంలో వినోద్ కాంబ్లీలో చాలా సానుకూల మార్పులు కనిపించాయి.

ఆస్పత్రిలో క్రికెట్ ఆడుతున్న కాంబ్లీ.. వీడియో

వినోద్ కాంబ్లీ భారత్ తరఫున వన్డే, టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 1991లో టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. కాబట్టి అతను 2000 సంవత్సరంలో తన చివరి ODI మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా వినోద్ కాంబ్లిన్ నిలిచాడు. చిన్న వయసులోనే డబుల్ సెంచరీ చేసి ఘనత కూడా సంపాదించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..