చ‌రిత్ర సృష్టించిన బంగ్లా బౌల‌ర్.. ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడు వికెట్లు..

Taskin Ahmed: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. ఈ టోర్నీ ఐదో మ్యాచ్‌లో దర్బార్ రాజ్‌షాహి, ఢాకా క్యాపిటల్స్ తలపడ్డాయి. తస్కిన్ అహ్మద్ 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా తస్కిన్ అహ్మద్ నిలిచాడు. అంతేకాదు లీగ్ టోర్నీలో ఇంతటి ప్రదర్శన కనబర్చిన తొలి బౌలర్‌గా తస్కిన్ నిలిచాడు.

చ‌రిత్ర సృష్టించిన బంగ్లా బౌల‌ర్.. ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడు వికెట్లు..
Taskin Ahmed
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Jan 02, 2025 | 10:26 PM

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ టోర్నీ ఐదో మ్యాచ్‌ దర్బార్ రాజ్‌షాహి ఢాకా క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢాకా క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత లిటన్ దాస్, తాంజిద్ హసన్ వికెట్లు తీశారు. ఆ తర్వాత మిడిలార్డర్‌లో స్టె ఎస్కినాజీ, షహదత్ దీపూ ఇన్నింగ్స్‌ను పుంజుకుని మూడో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడీని తస్కిన్ అహ్మద్ సక్సెస్ బౌలింగ్‌తో విడగొట్టాడు. ఆ తర్వాత డెత్ ఓవర్లలో విధ్వంసం సృష్టించాడు. మిగిలిన రెండు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. తస్కిన్ అహ్మద్ 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఢాకా క్యాపిటల్స్ 174 పరుగులకే ఆలౌటైంది. ఈ పరుగులను ఛేదించిన దర్బార్ రాజ్‌షాహీ జట్టు 3 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలో స్కోర్‌ను ఛేజ్ చేసింది.

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో తొలిసారిగా 7 వికెట్లు తీసిన ఘనత తస్కిన్ అహ్మద్ సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు మహ్మద్ అమీర్ మీద ఉంది. 17 పరుగులిచ్చి 6 వికెట్లు మహ్మద్ అమీర్ పడగొట్టాడు. అంతేకాదు లీగ్ టోర్నీలో ఇంతటి ప్రదర్శన కనబర్చిన తొలి బౌలర్‌గా తస్కిన్ నిలిచాడు. టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. మలేషియాకు చెందిన సియాజ్రుల్ ఇద్రాస్ టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్‌గా రికార్డు సృష్టించాడు. 2023లో చైనాపై 8 పరుగులకే 7 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో కోలిన్ అకెర్‌మాన్ పేరు రెండో స్థానంలో ఉంది. 2019లో బర్మింగ్‌హామ్ బేర్స్‌పై లీసెస్టర్‌షైర్ తరఫున ఆడుతున్నప్పుడు అకెర్‌మాన్ 18 పరుగులకు 7 వికెట్లు తీసుకున్నాడు.

రెండు జట్ల ఆటగాళ్లు

ఢాకా క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): లిటన్ దాస్ (వికె), తంజీద్ హసన్, షహదత్ హుస్సేన్ దీపు, స్టీఫెన్ ఎస్కినాజి, తిసర పెరీరా (సి), శుభమ్ రంజనే, అలావుద్దీన్ బాబు, చతురంగ డి సిల్వా, ముఖిదుల్ ఇస్లాం, నజ్ముల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహమాన్.

దర్బార్ రాజాషాహి (ప్లేయింగ్ XI): మహ్మద్ హరీస్, జీషన్ ఆలం, అనాముల్ హక్ (wk), యాసిర్ అలీ, ర్యాన్ బర్ల్, అక్బర్ అలీ (wk), సబ్బీర్ హుస్సేన్, హసన్ మురాద్, మోహర్ షేక్, షఫియుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్.