Grey Hair: చిన్న వయసులోనే  జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

Grey Hair: చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

Anil kumar poka

|

Updated on: Jan 02, 2025 | 6:54 PM

ఇటీవలి కాలంలో చాలామందికి చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతుంది. 30 నుండి 35 సంవత్సరాలు వచ్చేసరికి జుట్టు సాంతం తెల్లగా అయిపోతుంది. ఇలా చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడానికి కారణాలేంటి? నివారణ మార్గాలేంటి? నిపుణులేమంటున్నారో చూద్దాం. ఇక శరీరంలో విటమిన్ బి12, బి9 లోపాన్ని అధిగమించాలంటే పచ్చి కూరగాయలు, పండ్లను ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరమని డైటీషియన్లు చెప్పారు.

సాధారణంగా విటమిన్ బి12, విటమిన్ డి, విటమిన్ బి9 లోపిస్తే చిన్నవయసులోనే జుట్టు నెరిసిపోతుందని ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ హాస్పిటల్‌ డెర్మటాలజీ విభాగం మాజీ అధిపతి డాక్టర్‌ భావుక్‌ ధీర్‌ చెబుతున్నారు. 2019లో, ది లాన్సెట్ అనే మెడికల్ జర్నల్‌లోని ఒక నివేదికలో చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడానికి ప్రధాన కారణం విటమిన్ లోపం అని పేర్కొంది. క్యాల్షియం లోపం వల్ల చాలా మందిలో జుట్టు గ్రే అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. శరీరంలో పిత్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవారి వెంట్రుకలు కూడా చిన్నవయసులోనే తెల్లగా మారుతాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అంతే కాకుండా చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడానికి సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా కారణం అంటున్నారు. పైత్యరసం అధికంగా ఉత్పత్తి కావడం వల్ల జుట్టు మూలాలు దెబ్బతింటాయని, దీని వల్ల జుట్టు నెరిసిపోతుందని చెబుతున్నారు. పిత్తం అధికంగా ఉత్పత్తి కావడం వల్ల కొంతమందికి శరీరంలో మెలనిన్ లోపం ఏర్పడి జుట్టు రంగుపై ప్రభావం చూపుతుంది. శరీరంలో పిత్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవారు త్రిఫల చూర్ణం తీసుకోవాలని సూచిస్తున్నారు. రోజూ ప్రాణాయామం చేయడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు.

ఇక శరీరంలో విటమిన్ బి12, బి9 లోపాన్ని అధిగమించాలంటే పచ్చి కూరగాయలు, పండ్లను ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరమని డైటీషియన్లు చెప్పారు. అంతేకాకుండా గుడ్డు, సాల్మన్ చేపలను కూడా తినవచ్చు. విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి, పాలు, పెరుగు, గుడ్లు తినవచ్చు. వీటిని పాటించే ముందు విటమిన్ బి12, విటమిన్ డి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. ఈ విటమిన్స్ లోపిస్తే వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. దీనితో, విటమిన్ లోపాన్ని సులభంగా భర్తీ చేయవచ్చు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Jan 02, 2025 06:21 PM