Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HMPV Virus: బాబోయ్‌.. చైనాలో మరో మిస్టరీ వైరస్‌ కలకలం! ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగులు

చైనా పేరు వార్తల్లో వినిపిస్తేనే దడ పుడుతుంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని యావత్ ప్రపంచం హడలెత్తిపోతుంది. అయితే చైనా అనుకున్నంత పని చేసింది. ఐదేళ్లు విధ్వంసం సృష్టించిన కోవిడ్ ని మరువక ముందే ఇదే చైనా నుంచి మరో మిస్టరీ వైరస్ మానవకోటిపై దాడి చేస్తుంది. ఇప్పటికే చైనా ఆసుపత్రుల్లో ఈ వైరస్ వ్యాప్తి కారణంగా రోగుల సంఖ్య భారీగా పెరిగింది..

HMPV Virus: బాబోయ్‌.. చైనాలో మరో మిస్టరీ వైరస్‌ కలకలం! ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగులు
HMPV Virus
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 03, 2025 | 6:46 AM

ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి విధ్వంసం ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉంది. ఈ గడ్డుకాలంలో యావత్‌ ప్రపంచం అల్లాడిపోయింది. కోడిడ్‌కి కేంద్రమైన చైనాలో ఐదేళ్ల తర్వాత మరోమారు కలకలం రేగుతుంది. ప్రస్తుతం.. చైనాలో మరో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ (HMPV) వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాలు చెబుతున్నాయి. HMPV అనేది RNA వైరస్. ఇది న్యుమోవిరిడే, మెటాప్న్యూమోవైరస్ జాతికి చెందినది. ఈ వైరస్‌ బారినపడి చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. హెచ్‌ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎమర్జెన్సీ కూడా ప్రకటించినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు

HMPV వైరస్‌ సోకినవారిలో కొవిడ్ తరహా మాదిరి లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లతో బాధపడుతున్న పిల్లల నమూనాలను అధ్యయనం చేస్తున్న డచ్ పరిశోధకులు 2001లో దీన్ని మొదటిసారిగా గుర్తించినట్లు చెబుతున్నారు. అంటే దాదాపు ఆరు దశాబ్దాలుగా మనుగడలో ఉంది. చైనా నుంచి కోవిడ్‌-19 విధ్వంసం సృష్టించిన ఐదేళ్ల తర్వాత ఈ మిస్టరీ వైరస్‌ ప్రబలుతోంది. వైరస్‌ వ్యాప్తిని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. తమ పౌరులు ముఖానికి మాస్క్‌లు ధరించాలని, తరచుగా చేతులు కడుక్కోవాలని వైద్య అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు.

కోవిడ్‌ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు నియంత్రణ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అక్కడి అధికార మీడియా ‘సీసీటీవీ’ వెల్లడించింది. ముఖ్యంగా HMPV వైరస్‌ కేసులు డిసెంబరు 16 నుంచి 22 మధ్య అధిక సంఖ్యలో నమోదైనట్లు ఈ మీడియా వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఏమిటీ HMPV వైరస్‌?

ఈ వైరస్‌ శ్వాసకోశ వ్యాధికారకం. ఇది దగ్గు, తుమ్ముల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీని ప్యుబర్లీ టైంమూడు నుండి ఐదు రోజులు. ఈ వైరస్ పిల్లలు, రోగనిరోదకశక్తి బలంగా లేనివారిపై దాడి చేస్తుంది. ఇది దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, జలుబు ఈ వైరస్‌ సాధారణ లక్షణాలు. HMPV వైరస్‌ నివారణకు ఎలాంటి టీకాలు అందుబాటులో లేవు. నివారణకు రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, రద్దీగా ఉండే ప్రాంతాలను నివారించడం వంటివి చేయాలి. అలాగే పరిశుభ్రతను నిర్వహించడం, ఇంటి లోపల సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.