AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC Constable Exam Dates: కానిస్టేబుల్ పరీక్ష తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరగనున్న కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీలు మారినట్లు కమిషన్ ప్రకటన జారీ చేసింది. పలు అనివార్య కారణాల రిత్య రాత పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేసింది. తాజా షెడ్యూల్ వివరాలను ఈ కింద వివరణాత్మకంగా తెలుసుకోవచ్చు..

SSC Constable Exam Dates: కానిస్టేబుల్ పరీక్ష తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!
SSC Constable Exam Dates
Srilakshmi C
|

Updated on: Jan 03, 2025 | 6:07 AM

Share

హైదరాబాద్‌, జనవరి 3: కేంద్ర సాయుధ బలగాల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ఆధ్వర్యంలో భర్తీ చేయనున్న కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీలు మారాయ్‌. ఈ మేరకు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్సు (CRPF) అధికారిక ప్రకటన జారీ చేసింది. గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం కానిస్టేబుల్ కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలు ఫిబ్రవరి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరుగున్నట్లు పేర్కొంది. అయితే ఈ తేదీలలో స్వల్ప మార్పు చేస్తూ తాజాగా సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు కానిస్టేబుల్ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ఫిబ్రవరి 4, 5, 6, 7, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరుగుతుందని కమిషన్‌ పేర్కొంది. దాదాపు గతంలో ఇచ్చిన తేదీలలోనే పరీక్షలు జరుగుతాయి. అయితే మధ్యలో ఫిబ్రవరి 8, 9, 24వ తేదీన జరగవల్సిన పరీక్షలను మాత్రం తొలగించింది. అంటే ఈ మూడు రోజుల్లో పరీక్షలు జరగవన్నమాట. మొత్తం 14 రోజుల్లో కానిస్టేబుల్‌ పరీక్ష జరుగుతాయి.

కాగా ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో మొత్తం 39,481 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్‌ డ్యూటీ) పోస్టులు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ పరీక్ష ఇంగ్లిష్‌, హిందీ భాషల్లోనే కాకుండా తెలుగుతో సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. రాతపరీక్ష అనంతరం ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం ఇలా..

రాత పరీక్ష మొత్తం 80 ప్రశ్నలకు 160 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయిస్తారు. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ విభాగం నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగం నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ విభాగం నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు, ఇంగ్లిష్‌/ హిందీ విభాగం నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!
భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!
డెడ్‌లైన్‌ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
డెడ్‌లైన్‌ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
575 మెట్లు ఎక్కి ఆంజనేయుడిని దర్శించుకున్న స్టార్ హీరో దంపతులు
575 మెట్లు ఎక్కి ఆంజనేయుడిని దర్శించుకున్న స్టార్ హీరో దంపతులు