Viral Video: ఓ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరమ్మాయిల లవ్ స్టోరీ! కట్‌చేస్తే సిగపట్లు పట్టి పిచ్చకొట్టుడుకొట్టుకున్నారు
మరికొన్ని రోజుల్లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. తోటి విద్యార్దులంతా పుస్తకాలతో కుస్తీ పడుతుంటే.. యూనీఫాం ధరించి ఉన్న ఇద్దరమ్మాయిలు మాత్రం స్కూల్ ఆవరణలోనే జుట్టు పట్టి పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. దీంతో రణరంగంగా మారింది. చేసేదిలేక పెద్దలు జోక్యం చేసుకున్నారు. అసలు సంగతి విని నోరెళ్లబెట్టారు. ఇంతకీ విషయం ఏమంటే..
లక్నో, జనవరి 2: ఆ అమ్మాయిలది స్కూల్ వయసు. స్కూల్‌కి వెళ్లి శ్రద్ధగా చదవాల్సిన వయసులో ప్రేమలో పడ్డారు. అదీ.. ఇద్దరమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమించారు. ఈ విషయం ఇద్దరికీ ఆలస్యంగా తెలియడంతో.. నా బాయ్ ఫ్రెండ్ నాకే సొంతం అంటూ ఇద్దరు బాలికలు రోడ్డెక్కారు. అంతేనా.. సిగపట్లు పట్టి స్కూల్ ఆవరణలోనే పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. తోటి విద్యార్ధులు ఆపేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. చివరకు పెద్దలు జోక్యం చేసుకోవడంతో వీరి తగాదా తీరింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లోని సింఘ్‌వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీనగర్ సరాయ్‌లో ఉన్న ఓ స్కూల్‌లో ఇద్దరు అమ్మాయిలు అదే స్కూల్లో చదువుతున్న మరో అబ్బాయిని ప్రేమించారు. ఇద్దరూ ఒకే అబ్బాయిని ప్రేమించారన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఇద్దరమ్మాయిలు స్కూల్లోనే గొడవకు దిగారు. స్కూల్ యూనీఫాంలో ఉన్న ఇద్దరు జుట్లుపట్టి కొట్టుకోవడం ప్రారంభించారు. ఒకరినొకరు తన్నుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ, తోసుకుంటూ నానాయాగి చేశారు. తోటి విద్యార్థినులు వారిని ఆపేందుకు ప్రయత్నించినా లాభంలేకుండా పోయింది. దీంతో బాటసారులు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడిపించారు. ఆనక విషయం తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు.
उत्तर प्रदेश के बागपत में एक हैरान कर देने वाला वीडियो सामने आया है. वीडियो में देख जा सकता है कि लड़कियां व्यस्त रोड के बीच में आपस में झगड़ रही हैं दे रही हैं. बागपत में बॉयफ्रेंड को लेकर छात्राओं के बीच महाभारत देखने को मिला है. कस्बा में नगर सराय में स्कूल से घर वापस लौट रही… pic.twitter.com/YmRSU7xvW5
— News11 Bharat (@news11bharat) January 2, 2025
హాఫ్ టికెట్ గాళ్ల ప్రేమాయణం విని నవ్వాలో.. ఏడ్వాలో తెలియక తలలు పట్టుకున్నారు. బాయ్ ఫ్రెండ్ కోసం కొట్టుకున్న ఇద్దరు బాలికలు 10వ తరగతి చదువుతున్నారు. వీరు ఘర్షణ పడుతున్న దృశ్యాలు పాఠశాలకు ఎదురుగా ఉన్న షాప్‌లోని సీసీకెమెరాలో రికారడ్డయ్యాయి. మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. అమ్మాయిల గొడవపై సింఘౌలి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో స్పందించారు. తమకు ఇంత వరకు ఫిర్యాదు అందలేదని, వీడియోను పరిశీలిస్తున్నామని, తదనుగుణంగా కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు.