పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
ఘజియాబాద్‌లోని ముస్సోరీ పోలీస్ స్టేషన్ పరిధిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ పొలంలో రాత్రికి రాత్రి పెద్ద గొయ్యి ఏర్పడటం.. అందులో శివలింగం ఉండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎప్పటిలాగే ఉదయాన్నే పొలానికి వచ్చిన యజమాని.. అక్కడ పెద్ద గుంతను చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత పెద్ద గుంత ఎలా ఏర్పడిందబ్బా అని ఆలోచనలో పడ్డాడు. ఆ గుంతలోకి పరిశీలనగా చూశాడు.
అందులో పెద్ద రాయిలాంటిది కనిపించింది. అది కాస్త అనుమానాస్పదంగా అనిపించడంతో దానిని బయటకు తీసి షాకయ్యాడు. అది సాక్షాత్తూ శివలింగం. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో ఆ శివలింగాన్ని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. ముబారిక్‌పూర్ దాస్నా గ్రామంలో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నిజానికి పిడుగుపాటు వల్ల ఈ పొలంలో పెద్ద గుంత ఏర్పడింది. ఉదయాన్నే తన పొలానికి వచ్చిన ఆ యజమాని ఆ గుంతలో ఏముందోనని టార్చ్ వేసి చూశాడు. అందులో శివలింగం కనిపించింది. దానిని బయటకు తీయగా ఆ శివలింగానికి మూడు గీతలతో కూడిన త్రిపుండ్ చిహ్నం కూడా ఉంది. వ్యవసాయ క్షేత్రంలోని గుంతలో శివలింగం కనిపించడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. శివనామస్మరణతో ఆ ప్రాంగణం మార్మోగింది. అక్కడినుంచి శివలింగాన్ని ఊరేగింపుగా సమీప ఆలయానికి తరలించి పూజలు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !! ఎందుకంటే..
ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌లో ‘ఒకే ఒక్కడు’ ఎన్ని రూ.లక్షల ఆర్డర్ చేశాడంటే..
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

