అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
భగవంతుని గురించి..ఇందుగలడందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడికి చెప్పడం.. ఆ సమయంలో తాను అన్నింటా ఉన్నానని తెలియజేస్తూ ఓ స్థంభాన్ని చీల్చుకొని ఉగ్రనరసింహుడు బయటకు రావడం పురాణాల్లో చదువుకుని ఉంటారు. సినిమాల్లోనూ ఆ ఘట్టాన్ని మనకు కళ్లకుగట్టినట్టు చూపించారు. నిజానికి ప్రతీ జీవిలోనూ భగవంతుడు ఉన్నాడని హిందువులు విశ్వసిస్తారు.
ఆ విశ్వాసాన్ని రుజువు చేసే ఎన్నో ఘటనలు ఎక్కడో అక్కడ బయటపడుతూనే ఉన్నాయి. ఇటీవల కొబ్బరికాయలో వినాయకుడు తొండంతో సహా దర్శనమిచ్చాడని అంతా పూజలు చేశారు. తాజాగా ఓ మామిడి చెట్టులో నరసింహస్వామి రూపం ఏర్పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు చోటు చేసుకుంటాయి. అవి దేవుని మహిమలుగా ప్రజలు చెప్పుకుంటారు. విశ్వసిస్తారు. అటువంటి వింత సంఘటనే పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం బొండాడ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మందపాటి వెంకటేశ్వరరావు కుమారుడు రామలింగేశ్వరరావు ఇంటి పెరట్లో ఓ మామిడిచెట్టు ఉంది. ఆ మామిడి చెట్టుకు లక్ష్మీ నరసింహస్వామి రూపం ఏర్పడింది. ఇంటి యజమాని తొలుత యాదృచ్ఛికంగా వచ్చిందేమోనని పట్టించుకోకుండా వదిలేశారు. రోజురోజుకు ఆకారం మరింత స్పష్టంగా కనిపించడంతో కుటుంబ సభ్యులు లక్ష్మి నరసింహస్వామిగా గుర్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !! ఎందుకంటే..
ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌లో ‘ఒకే ఒక్కడు’ ఎన్ని రూ.లక్షల ఆర్డర్ చేశాడంటే..
శ్మశానంలో అస్తికల చోరీ.. ఎందుకంటే..
ట్రైన్ చక్రాల కింద వేలాడుతూ 250 కి.మీ. జర్నీ
వావ్.. పులులు ఇలా కూడా ప్రవర్తిస్తాయా ?? ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు