GATE 2025 Admit Cards: గేట్‌ అడ్మిట్‌ కార్డుల విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న గేట్ 2025 ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు మరో నాలుగు రోజుల్లో విడుదలకానున్నాయి. ఈ మేరకు ఐఐటీ రూర్కీ తాజాగా ప్రకటన జారీ చేసింది. గేట్ స్కోర్ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థల్లో ఎమ్‌టెక్‌ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు స్కాలర్ షిప్ కూడా అందుతుంది..

GATE 2025 Admit Cards: గేట్‌ అడ్మిట్‌ కార్డుల విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
GATE 2025 Admit Cards
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 03, 2025 | 6:58 AM

హైదరాబాద్‌, జనవరి 3: ఐఐటీలు సహా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) 2025 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఐఐటీ రూర్కీ మరో కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఇప్పటికే గేట్ పరీక్ష షెడ్యూల్‌ విడుదలవగా.. తాజాగా అడ్మిట్‌ కార్డు విడుదలకు సంబంధించిన డేట్‌ను ఐఐటీ రూర్కీ ప్రకటించింది. తాజా ప్రకటన మేరకు గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) 2025 అడ్మిట్‌ కార్డులు జనవరి 7న విడుదల చేయనున్నట్లు ఐఐటీ రూర్కీ వెల్లడించింది.

ఇక గేట్ పరీక్షలను 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఇప్పటికే పరీక్ష షెడ్యూల్‌ కూడా విడుదలైంది. ఈ పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు మొదటి సెషన్‌ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 4 రోజులపాటు ఈ పరీక్షలు జరుగుతాయి. గేట్‌ 2025 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు జనవరి 2వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఫలితాలు మార్చి 19వ తేదీన విడుదల చేస్తారు. మొత్తం 30 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.

గేట్‌ స్కోర్‌ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థల్లో ఎమ్‌టెక్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు కూడా గేట్ స్కోర్ ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. గేట్‌ స్కోర్‌ ద్వారా ఎంటెక్‌ కోర్సులో ప్రవేశాలు పొందిన విద్యార్ధులకు నెలకు రూ.12,400ల చొప్పున స్కాలర్‌షిప్‌ సైతం అందజేస్తారు. ఇక ఐఐటీల్లో అయితే గేట్‌ స్కోర్‌తో నేరుగా పీహెచ్‌డీలో కూడా ప్రవేశాలు కల్పిస్తాయి. అందుకే యేటా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులు గేట్‌ ప్రవేశపరీక్షకు పోటీ పడుతుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.