AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGC NET 2024 Exam: మరికాసేపట్లో యూజీసీ- నెట్‌ పరీక్షలు ప్రారంభం.. 30 నిమిషాల ముందే గేట్లు క్లోజ్‌

యూజీసీ- నెట్‌ 2024 పరీక్షలు మరికాసేపట్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ప్రారంభంకానున్నాయి. ఆన్ లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలు రోజుకు రెండు సెషన్ల చొప్పున జరగనున్నాయి. పరీక్ష ప్రారంభానికి అర గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు..

UGC NET 2024 Exam: మరికాసేపట్లో యూజీసీ- నెట్‌ పరీక్షలు ప్రారంభం.. 30 నిమిషాల ముందే గేట్లు క్లోజ్‌
UGC NET 2024 Exam
Srilakshmi C
|

Updated on: Jan 03, 2025 | 7:36 AM

Share

హైదరాబాద్‌, జనవరి 3: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 (యూజీసీ- నెట్‌) పరీక్షలు నేటి నుంచి (జనవరి 3) ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నేటి నుంచి దాదాపు 8 రోజులపాటు రోజుకు రెండు సెషన్ల చొప్పున ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. తొలి సెషన్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. అలాగే రెండవ సెషన్ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. జనవరి 3, 6, 7, 8, 9, 10, 15, 16 తేదీల్లో యూజీసీ నెట్‌ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 85 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహించనున్నారు.

యూజీసీ నెట్‌ 2024 డిసెంబర్‌ సెషన్‌ పరీక్ష.. రెండు పేపర్లకు జరుగుతుంది. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌ 1 లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులను కేటాయిస్తారు. 3 గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. పేపర్‌ 1లో రీజనింగ్‌ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైరెర్జంట్‌ థింకింగ్‌, జనరల్‌ అవేర్‌ననెస్‌పై ప్రశ్నలు ఉంటాయి. ఇక పేపర్ 2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్‌లో ప్రశ్నలు వస్తాయి. లాంగ్వేజెస్‌ మినహా మిగతా అన్ని క్వశ్చన్‌పేపర్లు ఇంగ్లిష్, హిందీ మీడియంలో మాత్రమే వస్తాయి.రిజర్వ్‌డ్ కేటగిరీ వారికి 35 శాతం, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి 40 శాతం మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది.

యూజీసీ- నెట్‌ పరీక్ష రాసేవారికి ముఖ్య సూచనలు

  • పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు. ఈలోపు అభ్యర్ధులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాలి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫోటో మాదిరి ఉండే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అభ్యర్ధులు హాజరు షీట్‌కు అతికించాలి. అడ్మిట్ కార్డ్‌లోని పేరుకు సరిపోలే చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్‌లలో.. ఏదైనా ఒక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి.
  • కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు లేదా సహాయం కోసం, అభ్యర్థులు 011-40759000లో NTA హెల్ప్‌లైన్‌ని సంప్రదించవచ్చు.

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఏప్రిల్ 2025లో జరగనున్న తెలంగాణ పదో తరగతి, ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లించడానికి తేదీలను ప్రకటించింది. ఫీజు చెల్లించే గడువు తేదీలు అధికారిక వెబ్‌సైట్ లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ