AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శీతాకాలపు రక్షణ కవచాలు.. ఈ మూడు మీ ఆహారంలో ఉంటే.. ఆ సమస్యకు చూమంత్రం వేసినట్టే!

Boost Winter Immunity Naturally: శీతాకాలం వచ్చింటే చాలా తరచూ జనాలు అనారోగ్యం భారీన పడుతూ ఉంటారు. ఇందకు ప్రధాన కారణం రోగనిరోధక శక్తి తగ్గడం. దీనిని తగ్గకుండా చూసుకోవడం కోసం మన రోజువారీ ఆహారంతో పాటు, శరీరానికి మరిన్ని పోషకాలు అవసరం. అలాంటి సందర్భంలో మన వంటిట్లో దొరికే ఈ మూడు పదార్థాలు మీరు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచడంతో పాటు శరీరానికి తగినంత శక్తిని అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంతకూ అవేంటో తెలుసుకుందాం పదండి.

శీతాకాలపు రక్షణ కవచాలు.. ఈ మూడు మీ ఆహారంలో ఉంటే..  ఆ సమస్యకు చూమంత్రం వేసినట్టే!
Turmeric, Jaggery And Pepper Benefits
Anand T
|

Updated on: Dec 30, 2025 | 4:42 PM

Share

శీతాకాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రధాన సమస్యలు జలుబు, దగ్గు, జ్వరం, ఈ సమస్యలతో పోరడడానికి మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. దీన్ని పెంచుకునేందుకు మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో మనకు పసుపు, బెల్లం, నల్ల మిరియాలు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. శాస్త్రవేత్తలు ఈ మూడింటిపై అధ్యయనం చేసి ఇవి శీతాకాలంలో మన శరీరానికి రక్షణ కవచాలుగా పనిచేస్తాయని పేర్కొన్నారు. వీటిలో ఉండే పోషకాలు అనేక రకాల వ్యాధుల నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయని తెలిపారు.

పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు

పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని, ఇవి శరీరానికి వెచ్చగా ఉంచి.. శక్తిని అందిస్తాయని తెలిపారు. అంతేకాదు ఇవి జలుబు, దగ్గును కూడా నివారించంచగలవని తెలిపారు. కీళ్ల నొప్పులను తగ్గించడానికి ,చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన పదార్థం అని తెలిపారు.

నల్ల మిరియాల వల్ల కలిగే ప్రయోజనాలు

నల్ల మిరియాలలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే మన శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది చర్మ సంరక్షణలో కూడా సహాయపడుతుంది. దీంతో పాటు కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు

శీతాకాలంలో బెల్లం తినడం వల్ల శరీరం లోపలి నుండి వెచ్చగా ఉంటుంది. జలుబు ,దగ్గును నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరానికి శక్తిని ఇవ్వడానికి ఇది అద్భుతమైనది. బెల్లంలో ఇనుము, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శీతాకాలంలో జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఇలా ఆహారంలో చేర్చుకోండి

మీరు ఈ మూడు పదార్థాలను మీ రోజువారీ ఆహారంలో విడిగా చేర్చుకోవచ్చు. లేదా పసుపు, బెల్లం, నల్ల మిరియాలను పొడిగా చేసి దానిని వేడి నీటిలో కలుపుకొలి కూడా తాగవచ్చు. ఇందుకోసం ఒక కప్పు పాలు లేదా నీటిని వేడి చేసి అందులో అర టీస్పూన్ పసుపు, చిటికెడు నల్ల మిరియాలు పొడి, కాస్త బెల్లం కలిపి వేడిగా మరిగించి తాగండి, ఇది జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

(గమనిక: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మాత్రమే అందించబడింది. వీటిపి టీవీ9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీరు సొంత బ్యాంకును ప్రారంభించవచ్చా? ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
మీరు సొంత బ్యాంకును ప్రారంభించవచ్చా? ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
నేలపై నూనె పడితే నీళ్లతో కడుగుతున్నారా?ముందు ఈ విషయం తెలుసుకోండి!
నేలపై నూనె పడితే నీళ్లతో కడుగుతున్నారా?ముందు ఈ విషయం తెలుసుకోండి!
ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..!
ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..!
వైభవ్, శాంసన్ విఫలం.. కేక పెట్టించిన సూర్య..!
వైభవ్, శాంసన్ విఫలం.. కేక పెట్టించిన సూర్య..!
భారత్‌ Vs న్యూజిలాండ్‌.. మైదానంలో బిగ్ ఫైట్‌ను ఆపిన కోహ్లీ
భారత్‌ Vs న్యూజిలాండ్‌.. మైదానంలో బిగ్ ఫైట్‌ను ఆపిన కోహ్లీ
మహేష్ బాబు సినిమా హిట్ అవ్వడానికి కారణం అతనే..
మహేష్ బాబు సినిమా హిట్ అవ్వడానికి కారణం అతనే..
పాత పట్టు చీరల జరీలో నిజంగానే బంగారం, వెండి ఉంటాయా?ఎన్ని గ్రాములు
పాత పట్టు చీరల జరీలో నిజంగానే బంగారం, వెండి ఉంటాయా?ఎన్ని గ్రాములు
కారు ఇంజిన్ ఆయిల్ విషయంలో ఈ తప్పు చేస్తున్నారా?
కారు ఇంజిన్ ఆయిల్ విషయంలో ఈ తప్పు చేస్తున్నారా?
చికెన్ కర్రీలో నీచు వాసన వస్తోందా? ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..
చికెన్ కర్రీలో నీచు వాసన వస్తోందా? ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..
మరో రాప్తాడు ఘటన షోరూమ్‌లోకి వెంటాడి 17ఏళ్ల బాలిక గొంతు కోసి హత్య
మరో రాప్తాడు ఘటన షోరూమ్‌లోకి వెంటాడి 17ఏళ్ల బాలిక గొంతు కోసి హత్య