Srisailam temple: శ్రీశైలం ఆలయంలో డ్రోన్ కలకలం..అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది
శ్రీశైలం క్షేత్రం పరిధిలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. శ్రీశైలం ఆలయం ప్రధాన గోపురం సమీపంలోని ఆకాశంలో యాత్రికులు డ్రోన్ కెమెరాను ఎగరవేశారు. ఆకాశంలో డ్రోన్ ఎగురుతుండగా దేవస్థానం సెక్యూరిటీ ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రం పరిధిలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. శ్రీశైలం ఆలయం ప్రధాన గోపురం సమీపంలోని ఆకాశంలో యాత్రికులు డ్రోన్ కెమెరాను ఎగరవేశారు. ఆకాశంలో డ్రోన్ ఎగురుతుండగా దేవస్థానం సెక్యూరిటీ ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. తమ సిబ్బందితో అప్పటికప్పుడు డ్రోన్ ఎగురుతున్న ప్రదేశానికి హుటాహుటిన చేరుకున్నారు. దేవస్థానం అధికారుల అనుమతి లేకుండా డ్రోన్ ఎలా ఎగరవేస్తున్నారని వారిపై మండిపడ్డారు. దేవస్థానం పరిధిలో డ్రోన్ కెమెరాలు నిషేధించడం జరిగిందని డ్రోన్ ఎగురవేసిన ఇద్దరు వ్యక్తులను సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను పోలీసులకు అప్పచెప్పారు. వారి వివరాలను సేకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వ్యక్తులుగా వారిని పోలీసులు గుర్తించారు. పోలీసులు విచారణలో పూర్తి వివరాలు వెలడించాల్సి ఉంది.