Meghana: పెళ్లై 20 ఏళ్లైనా అమ్మ పిలుపునకు నోచుకోని బుల్లితెర నటి.. కారణమేంటో తెలిస్తే కన్నీళ్లాగవు
తెలుగు సీరియల్స్, టీవీ షోస్ చూసే వారికి ఇంద్రనీల్- మేఘన జంట గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ బుల్లితెరకు సంబంధించి ఎంతో అన్యోన్యమైన జంటల్లో వీరు కూడా ఒకరు. అయితే పెళ్లై 20 ఏళ్లైనా ఈ దంపతులకు సంతానం లేదు.
తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ సీరియల్స్ లో కచ్చితంగా చక్రవాకం ఉంటుంది. ఈ సీరియల్‌తోనే తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు ఇంద్రనీల్, మేఘన. ఈ సీరియల్ టైంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కాగా ఇంద్రనీల్ కంటే వయసులో పెద్దది మేఘన. దీంతో మొదట్లో వీళ్ల పెళ్లికి ఇరుపెద్దలు అంగీకరించలేదు. అయితే ఇంద్రనీల్- మేఘన ఎలాగోలా పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2004 డిసెంబర్ 12న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారీ సీరియల్ జోడి. అంటే వీళ్ల వైవాహిక బంధానికి 20 ఏళ్లు నిండాయన్న మాట. అయితే పెళ్లై 20 ఏళ్లు అయినా ఈ దంపతులకు ఇంకా సంతానం కలగలేదు. దీనికి సంబంధించి షాకింగ్ విషయాలను బయటపెట్టింది మేఘన. ‘ 2004లో ఆఖరులో మేము పెళ్లి చేసుకున్నాం. కానీ నాకు రెండుసార్లు గర్భస్రావమైంది. అందులో ఒకసారి డైరెక్టర్ మిస్టేక్ వల్లే అయ్యింది. ప్రెగ్నెన్సీతోనే ఒకసారి సీరియల్ షూటింగ్‌కు వెళ్లాను. అప్పుడు నాకు రెండో నెల అనుకుంటా. కాబట్టి ప్రెగ్నెన్సీ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
‘కానీ షూటింగ్ లో భాగంగా డైరెక్టర్ దాదాపు 40 సార్లు నన్ను మెట్లెక్కించాడు. వద్దు సర్ అని చెప్తున్నా ఆయన వినిపించుకోలేదు. కాసేపటికి నావల్ల కాక కింద కూర్చుండిపోయాను. అప్పుడే నాకు రక్తస్రావమైంది. ఈ గర్భస్రావం తర్వాత సుమారు ఆరేళ్లపాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ బాధతో ఇండస్ట్రీకి కూడా దూరమయ్యాను. ఆ సమయంలోనే నా శరీర బరువు బాగా పెరిగింది. మా ఇద్దరికీ పిల్లలంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు మాకు 40 ఏళ్లు వయసు దాటేసింది. దీంతో పిల్లల గురించి ఆలోచించడం మానేశాం’
ఇంద్రనీల్- మేఘనల లేటెస్ట్ డ్యాన్స్ వీడియో..
View this post on Instagram
‘ఈ సమయంలో పిలల్ని కంటే.. వాళ్లకి 20 ఏళ్లు వచ్చేసరికి మాకు 60 ఏళ్లు వచ్చేస్తాయి. అలాంటి సమయంలో మాకు సడెన్‌గా ఏమైనా అయితే.. వాళ్లని ఎవరు చూసుకుంటారు? అందుకే పిల్లల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు’ అని అంటోంది మేఘన.
భార్య మేఘనతో నటుడు ఇంద్రనీల్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.