Brahmamudi, January 3rd Episode: దుగ్గిరాల ఇంట్లో మొదలైన కార్ల పంచాయతీ.. జస్ట్ మిస్ అయిన నంద!
సెక్యురిటీకి మాయ మాటలు చెప్పి నంద గోపాల్ గెస్ట్ హౌస్‌లోకి వెళ్తారు కావ్య, రాజ్‌లు. అప్పటికే నంద గోపాల్ కోసం అంతా రెడీ చేసి పెడతాడు సెక్యూరిటీ. ఆ ఫస్ట్ నైట్ తన కోసమే చేశాడని కావ్య గోల పెడుతూ ఉంటుంది. నీకో దండం తల్లీ.. ముందు ఆ నంద గోపాల్ గాడి సంగతి చూద్దాం అంటాడు. అంతలోనే లోపలికి వచ్చిన నంద గోపాల్‌ని పట్టుకుంటాడు రాజ్..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. నేనూ, ఈ మేడమ్ కలిసి కిడ్నాప్‌లు ప్లాన్ చేస్తామని రాజ్ అనేసరికి సావిత్రి దెబ్బకు దడుచుకుంటాడు. కావ్య కూడా ఎంకరేజ్ చేయడంతో సావిత్రి భయ పడుతూ.. నన్ను వదిలేయండి. నేను దిగిపోతాను అంటూ అరుస్తాడు. ఓరేయ్ సన్నాసి, ఏప్రాసి నిన్ను మేము కిడ్నాప్ చేసి ఆల్రెడీ రెండు గంటలు అయ్యింది. ఆ విషయం ఇంకా నీకు అర్థం కాలేదా? అని రాజ్ అంటే.. వామ్మో నా జాతకం నీచంగా ఉంటుందని తెలిసి కూడా మిమ్మల్ని నమ్మాను. మీకో దండం నన్ను వదిలి పెట్టమని సావిత్రి ఏడుస్తూ ఉంటే.. ఏవండి వదిలేయండి అని కావ్య అంటుంది. దీంతో రాజ్ కారు ఆపగానే పరిగెత్తుకుంటూ పారిపోతాడు సావిత్రి. ఈ సీన్ నిజంగానే నవ్వు తెప్పిస్తుంది. అవును నువ్వు ఏంటి వాడికి ఫుల్లుగా కోపరేట్ చేస్తున్నావు? అని రాజ్ అంటే.. లేదంటే మీరు నాతో గొడవ పెట్టుకుంటారా చెల్లుకు చెల్లు అని కావ్య అంటుంది. సరే కానీ.. ఆ నందా గాడి అడ్రెస్ దొరికింది వెళ్దామని రాజ్ అంటాడు.
గెస్ట్ హౌస్‌లోకి వెళ్లిన కావ్య, రాజ్‌లు..
కావ్య, రాజ్‌లు ఇద్దరూ కలిసి నంద గెస్ట్ హౌస్‌కి వెళ్తారు. బిల్డింగ్ చూసి.. ఎక్కడికి వెళ్లినా ఈ పాత బంగ్లా గోల ఏంటి నాకు? ఈ బంగ్లా చూస్తుంటే నాకు ఏదేదో గుర్తుకు వస్తుందని కావ్య అంటే.. ఇప్పుడు ఆ పీడ కలను ఎందుకు గుర్తు చేస్తున్నావు? అని రాజ్ అంటాడు. చేయాల్సింది అంతా చేసేసి.. మళ్లీ నా మీద ఎందుకు అరుస్తున్నారని కావ్య, రాజ్‌లు గొడవ పడుతూ ఉంటారు. వచ్చిన పని పూర్తి చేద్దామా.. లేటు అయితే ఈ ఎన్డీ గాడు పారిపోతాడని కావ్య అంటే ఇద్దరూ కలిసి గెస్ట్ హూస్‌లోకి వెళ్తూ ఉంటే సెక్యూరిటీ ఆపుతాడు. ఏంటయ్యా నన్ను ఆపుతున్నావు? నేనూ మీ ఎన్డీ ఇద్దరూ పాత స్నేహితులం. రెగ్యులర్‌గా ఇక్కడికి వచ్చే వాడిని కదా అని రాజ్ అంటే.. కావ్య మధ్యలో దూరిపోయి ఏంటి మీరు ఇక్కడికి రెగ్యులర్‌గా వచ్చారా? ఎంత మందిని తీసుకొచ్చారని కావ్య అంటే.. నీకో దండం.. ముందు ఈ పని కానీ అని రాజ్ అంటాడు.
ధాన్యాలక్ష్మి, రుద్రాణిల కార్ల పంచాయతీ..
సరే కానీ మీ సార్ నీకు ఏం చెప్పలేదా.. ఇద్దరు వస్తారు.. డబ్బులు ఇస్తారని ఏమీ చెప్పలేదా అని రాజ్ అడిగితే.. సెక్యూరిటీ లేదని చెప్తాడు. అరే నేను మీ సార్‌కి డబ్బులు ఇవ్వాలి అని రాజ్ అంటే.. ఇక సెక్యూరిటీ అయోమయంలో పడి.. లేదు సర్ నేను మిమ్మల్ని ఏమీ అనుమానించడం లేదు.. వెళ్లమని అంటాడు. దీంతో కావ్య, రాజ్‌లు ఇద్దరూ లోపలికి వెళ్తారు. మరోవైపు అపర్ణ, ఇందిరా దేవి బయటకు వెళ్తూ ఉంటారు. అప్పుడే ప్రకాశం మాట్లాడుతూ.. ఏంటి మా అమ్మా, వదినా రాగానే మాటలు ఆపేశారు. ఏం చేద్దామని.. ఇల్లు పీకి పందిరి వేద్దామనా అని అడుగుతాడు. ఎవరు ఎంత చెవులు కొరుక్కున్నా వాళ్లే చుప్పనాతి సూర్పణఖలు అయిపోతారని ఇందిరా దేవి అంటుంది. మీరు ఇద్దరూ ఎక్కడికి వెళ్తున్నారని ధాన్యలక్ష్మి అడిగితే.. ఆస్పత్రికి అని పెద్దావిడ చెబుతుంది. మీరు బాగానే బయలు దేరతారు. కారు ఏది అని రుద్రాణి అడిగితే.. సుభాష్‌కి ఫోన్ చేసి కార్ తీసుకు రమ్మన్నా అని ఇందిరా దేవి చెబుతుంది. అప్పుడే సుభాష్ వస్తాడు. కార్ కీస్ ఇమ్మని ప్రకాశం అంటే.. కారు ఉంటేనే కదా.. దారిలో బ్రేక్ డౌన్ అయింది. మెకానిక్‌ని పిలిచి చెప్పా అని సుభాష్ అంటాడు. ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు? అని ధాన్యలక్ష్మి అడిగితే.. ఇంట్లో ఉన్న కార్లు అన్నీ రిటర్న్ పంపించారంట కదా ఎందుకు? అని సుభాష్ అడిగితే.. ఇంటి పెద్ద కొడుకు మీకు కూడా చెప్పలేదా అని ధాన్యలక్ష్మి రాగాలు తీస్తుంది.
కావ్య బూత్ బంగ్లా గోల..
ఎవరు ఏం అనుకుంటే మా కెందుకు మేము వెళ్తామని క్యాబ్‌లో వెళ్తారు ఇందిరా దేవి, అపర్ణలు. ఈలోపు సుభాష్‌కి తన బాధని చెప్పుకుంటుంది రుద్రాణి. మధ్యలో రుద్రాణికి రివర్స్ వార్నింగ్ ఇస్తుంది స్వప్న. బిల్డింగ్ లోపలికి వెళ్లిన కావ్య, రాజ్‌లు బిల్డింగ్ మొత్తం చూస్తూ ఉంటారు. ఏవండీ నాకో డౌట్. ఇదేం మరో బూత్ బంగ్లా ప్లాన్ కాదు కదా.. ఎక్కడ బెడ్ వేయించారు? ఎక్కడ డెకరేషన్ చేయించారు? మన రెండో శోభనాన్ని ఏ గదిలో ప్లాన్ చేశారని కావ్య అంటుంది. ఏయ్ నేను ఎలా కనిపిస్తున్నాను. నాకు అలాంటి ఆలోచనలు లేవు అంటూ రాజ్ అంటాడు. అంతేనా అని కావ్య అడుగుతుంది. అమ్మా తల్లీ అలాంటిది ఏమీ లేదు. డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నాయేమో వెతుకుదామని వెళ్తారు. అక్కడ ఓ గదిలో బెడ్ రూమ్‌లో ఫస్ట్ నైట్ సెటప్ చూసి కావ్య, రాజ్‌లు షాక్ అవుతారు. అనుకున్నా.. కావాలనే చేశారు కదా.. కింద అన్ని రూములు ఉండగా.. మీరు పైకే ఎందుకు తీసుకొచ్చారని కావ్య అంటే.. ఏయ్ నీకేమన్నా మతిపోయిందా.. ఇది నేను ప్లాన్ చేసిన బూత్ బంగ్లా కాదని రాజ్ అంటాడు. సరే కానీ ముందు లైట్స్ వేయమని కావ్య అంటే.. ఎక్కడ ఏం ఉన్నాయో నాకేం తెలుసని అంటూ రాజ్ వెళ్లబోతుండగా.. కావ్య పైన పడుతుంది.
జస్ట్ మిస్ అయిన నంద గోపాల్..
ఇక అంతలోనే లోపలికి నంద గోపాల్, లిల్లీలు వస్తారు. వాళ్లు లోపలికి రాగానే కరెంట్ వస్తుంది. ఇక పైకి వెళ్తుండగా.. మెట్ల మీద అడ్డంగా రాజ్, కావ్యలు నిల్చుంటారు. ఎంత ధైర్యంరా నీకు మీ నాన్న మీద ఉన్న నమ్మకంతో మా తాతయ్య 100 కోట్లకు శూరిటీ పెడితే నువ్వు మోసం చేసి తప్పించుకుని తిరుగుతావా? ఇప్పుడు ఈ ఆస్తులు నీతోనే కక్కిస్తానని రాజ్ అంటే.. నేను మోసం చేయలేదని నంద గోపాల్ అంటాడు. ఇక రాజ్ తన స్టైల్‌లో నంద గోపాల్‌ని కొడుతూ ఉంటాడు. ఆ మూమెంట్‌లో తప్పించుకుని కారులో పారిపోతాడు నంద గోపాల్. నంద గోపాల్‌ని పారిపోతూ ఉండగా.. రాజ్ కారులో ఎక్కితే.. పెట్రోల్ అయిపోతుంది. అప్పుడే లిల్లీ వెళ్తుంటే.. ఏయ్.. ఆగు.. వాడు ఎక్కడికి వెళ్లాడని అడుగుతాడు. నాకేం తెలుసు అని సమాధానం చెప్పి పారిపోతుంది. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌లో మళ్లీ కలుద్దాం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..