Brahmamudi, January 2nd Episode: అప్పూ జ్ఞాపకాల్లో కళ్యాణ్.. నంద గోపాల్ దొరికేశాడుగా..
సాఫ్ట్ వేర్ సావిత్రి రాజ్ వాళ్ల కారు ఎక్కుతాడు. రాజ్ తనకు పెళ్లి కాలేదని డ్రైవర్‌ని అని చెబుతాడు. దీంతో కావ్యతో పులిహోర కలుపుతాడు సావిత్రి. అది చూసి రాజ్ కుళ్లుకుంటాడు. మరోవైపు కళ్యాణ్.. అప్పూ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటాడు. ఆ తర్వాత నంద గోపాల్ తన గర్ల్ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి రమ్మని అడిగితే.. నువ్వే రమ్మని అంటుంది..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఒకతను రాజ్ వాళ్ల కారు ఎక్కుతాడు. కావ్య వెనకాల కూర్చోగా.. అతను ముందు కూర్చుంటాడు. అవును మీరెందుకు విడి విడిగా కూర్చున్నారని అతను అడిగితే.. నేను అసలు ఇంకా పెళ్లే చేసుకోలేదు. ఆవిడ మా బాస్.. నేను ఆవిడ డ్రైవర్‌ని అని రాజ్ అంటే.. డ్రైవరా మరి ఇంత కాస్ట్‌లీ డ్రెస్ వేశావని అతను అడిగితే.. మా ఆయన ఒకసారి వేసుకున్న డ్రెస్ మళ్లీ వేసుకోరు. అందుకే ఇతనికి ఇచ్చామని కావ్య చెబుతుంది. మీరు ఎంత కోటీశ్వరులో.. నీ పేరు ఏంటి డ్రైవర్ బాబూ అని అతను అడిగితే.. ఐ యామ్ రాజ్ అని రాజ్ అంటాడు. దీంతో అతను నవ్వుతూ పేరుకే రాజువి.. పనికి బంటువి అని అంటాడు. అబ్బో తమరి పేరు ఏంటో అని రాజ్ అడిగితే సాఫ్ట్ వేర్ సావిత్రి అని చెబుతాడు. అది విని కావ్య, రాజ్ షాక్ అవుతారు. అదేంటి అలాంటి ఆడాళ్ల పేరు పెట్టుకున్నావని రాజ్ అడిగితే.. నేను ఎలా పెట్టుకుంటాను.. పంతులు పెట్టాడు. దానికో పెద్ద కథ ఉందిలే వింటారా అని సావిత్రి అడిగితే.. నేను వింటానులెండి షార్ట్‌గా చెప్పమని కావ్య అంటుంది.
సావిత్రి దరిద్రపు జాతకం..
సరే మేడమ్.. నేను కడుపులో పడగానే అమా అమ్మమ్మ చనిపోయింది. భూమి మీద పడగానే మా తాతయ్య చనిపోయాడు. బోర్లా పడగానే మా బాబాయ్ చనిపోయాడు. బుడి బుడి అడుగులు వేస్తే మా అన్నయ్య చనిపోయాడు. అప్పుడు కానీ మా అమ్మకు అర్థం కాలేదు. నాది ఎంత చెండాలమైన జాతకమో.. అప్పుడు పంతుల్ని అడిగితే.. నేను దురదృష్ట జాతకంలో పుట్టాను కాబట్టి.. ఇంట్లోని వారంతా కుక్క చావు చస్తారని చెప్పాడు. దీనికి రెమిడీ లేదా అని అడిగితే.. నా పేరు మగ పేరు కాకుండా.. ఆడ పేరు పెట్టారు. ఆ పేరు పెట్టగానే ఆయన కూడా చనిపోయాడని సావిత్రి చెబితే.. రాజ్, కావ్యలు షాక్ అవుతారు. అందుకే అప్పటి నుంచి నన్ను నష్ట జాతకుడు అని అంటారు. ఇంతకీ ఈ సావిత్రి పెళ్లి చూపుల్లో చూడబోయే అమ్మాయి ఎలా ఉంటుందోనని రాజ్ అడిగితే.. పెద్ద అందగత్తె.. అప్సరసలా ఉంటుందని సావిత్రి అంటే.. అబ్బో అలాంటి అప్సరస నీలాంటి వాడిని ఎలా చేసుకుంటుంది.. వాళ్ల నాన్నని కళ్ల ఆపరేషన్ చేయమని చెప్పు రాజ్ అంటే.. ఇంకెక్కడి వాళ్ల నాన్నా.. నా సంబంధం రాగానే చనిపోయాడని చెప్తాడు సావిత్రి. అమ్మో అని రాజ్ షాక్ అవుతాడు.
మేడమ్‌తో సావిత్రి పులిహోర..
అబ్బా ఎంత సేపూ మీరే ఎందుకు మాట్లాడతారు ఏంటి?.. వెనకున్న మేడమ్‌తో కాసేపు మాట్లాడతాను ఉండండి.. మేడమ్ మీ పేరు ఏంటి? అని సావిత్రి అడిగితే.. కావ్య అని చెబుతుంది. అబ్బా.. ఖరీదైన కారులా ఉన్నారు. అప్పుడే సావిత్రికి మెసేజ్ వస్తుంది. అది చూసి తెగ పొగుడుకుంటాడు సావిత్రి. మేడమ్ మీ నవ్వులో ఏదో మాయదారి మహాత్యం ఉంది.. మీరు ఇలా నవ్వగానే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న హోమ్ లోన్ వచ్చిందని సావిత్రి అంటాడు. కావ్య షేక్ హ్యాండ్ ఇవ్వబోతుండగా.. రాజ్ బ్రేక్ వేసి పడేసేలా చేస్తాడు. ఇక అప్పుడే సావిత్రి దిగి.. వెనక కావ్య పక్కన కూర్చుంటాడు. అది చూసి రాజ్ కుళ్లుకుంటాడు. మరోవైపు కళ్యాణ్ ఆస్పత్రిలో కూర్చుని ఉంటాడు. అక్కడికి గట్టిగా మాటలు వినిపించి బయటకు వెళ్తాడు. అందరూ గట్టిగా మాట్లాడుకుంటూ ఉండగా.. ఆపండి.. ఇది ఆస్పత్రి.. కాస్త నెమ్మదిగా మాట్లాడండి. పేషెంట్స్‌కి ఇబ్బంది అవుతుందని కళ్యాణ్ చెప్తాడు. అప్పుడే అక్కడ అప్పూ పోలీస్ డ్రెస్‌లో ఉన్నట్లు కనిపిస్తుంది. అప్పుడే కళ్యాణ్‌కు అప్పూతో గడిపిన రోజులన్నీ గుర్తుకు వస్తాయి.
కళ్యాణ్‌కు అప్పూ జ్ఞాపకాలు..
నీకు జాబ్ రాగానే.. వెంటనే సెలవు పెట్టి.. మనం హనీమూన్‌కి వెళ్దామని కళ్యాణ్ అంటే.. అబ్బా అంత లేదు.. నువ్వు కూడా లిరిక్ రైటర్ అవ్వాలి. ఆ తర్వాత హనీమూన్‌కి వెళ్దామని అప్పూ అంటుంది. సరే కానీ.. నువ్వు పోలీస్ అయ్యాక ఎలా ఉంటావో ఇప్పుడే చూడాలని ఉంది.. నా కోసం ఒక్కసారి డ్రెస్ వేసుకోవా అని కళ్యాణ్ అంటే.. నేను వేసుకోనని అప్పూ అంటుంది. ప్లీజ్ నా కోసం అంటూ కళ్యాణ్ బతిమలాడతాడు. ఇక పోలీస్ డ్రెస్‌లో వేసుకుని కనిపిస్తుంది అప్పూ. అలా అప్పూతో ఉన్న విషయాలు అన్నీ గుర్తుకు వస్తాయి. ఆ తర్వాత కావ్య కొబ్బరి నీళ్లు తాగాలని ఉందని కావ్య అడిగుతుంది. సావిత్రిని ఇబ్బంది పెట్టడానికి రాజ్ కావాలనే బ్రేక్ వేస్తాడు. ఇక కావ్య చేయి పట్టుకుని మరీ దింపుతాడు సావిత్రి. అది చూసి రాజ్‌కి మరింత బాగా మండుతుంది. అప్పుడే లాయర్ దగ్గర నుంచి సావిత్రికి ఫోన్ వస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి కోర్టులో పోరాడుతున్న ఆస్తి మీకే వచ్చిందని చెప్తాడు. అప్పుడే కావ్యకి షేక్ హ్యాండ్ ఇస్తుండగా.. రాజ్ కావాలనే కొబ్బరి బొండాన్ని కాలి మీద పడేస్తాడు. హేయ్ ఏంటి ఇలా పడేస్తావని రాజ్‌ని తిడతాడు సావిత్రి. నీ అంత నికృష్టమైన జాతకం వేరొకరికి ఉంటుందా అని రాజ్ అంటాడు. నన్నే అలా అంటే.. మా పక్కింట్లో ఒకడు పుట్టాడని వారి గురించి అంతా చెప్తాడు సావిత్రి. మళ్లీ కావ్యని దగ్గర ఉండి మరీ కారు ఎక్కిస్తాడు సావిత్రి. దీంతో మరింత ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతాడు రాజ్.
నంద గోపాల్‌కి ఫిటింగ్ పెట్టిన గర్ల్ ఫ్రెండ్..
మరోవైపు నంద గోపాల్ గెస్ట్ హౌస్‌కి వస్తాడు. అన్ని ఏర్పాట్లు చేయాలని సెక్యూరిటీకి చెప్తాడు నంద గోపాల్. ఆ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి.. లొకేషన్ పంపిస్తాను వచ్చేయ్ అని అంటాడు. నేను కావాలి అనుకుంటే నువ్వే రా.. నేను రానని ఆ అమ్మాయి అంటే.. నేనే వచ్చి చస్తానని నంద గోపాల్ చెప్తాడు. ఇక తన గర్ల్ ఫ్రెండ్‌ని తీసుకు రావడానికి వెళ్తాడు నంద గోపాల్. ఇక అప్పుడే రాజ్‌కి ఫోన్ వస్తుంది. నంద గోపాల్ అడ్రెస్ దొరికిందని పోలీస్ అడుగుతాడు. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..